Anjeer Benefits: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం
రోజుకో మూడు నుంచి నాలుగు ఎండు అంజీర్లు తింటే... చక్కని ఆరోగ్యం మీ సొంతం
ఎండు అంజీర్ పండ్లు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. చలికాలంలో వీటిని తినడం చాలా ముఖ్యం. చలికాలంలో సహజంగానే మన రోగనిరోధక శక్తి చురుకుగా ఉండదు. అందుకే త్వరగా వైరల్ ఫీవర్లు, దగ్గు, జలుబు వంటివి సంక్రమిస్తాయి. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. వైరస్‌ల వల్ల కలిగే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఎండు అంజీర్లు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. అంతేకాదు వీటితో ఇంకా అనేక లాభాలు ఉన్నాయి.
1. షుగర్ వ్యాధిగ్రస్తులకు అంజీర్ చాలా మేలు చేస్తుంది. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. దీనిలోని పొటాషియం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. రోజుకు మూడు నాలుగు అంజీర్లు తింటే చాలు.
2. శీతాకాలంలో ఎక్కువమంది పెద్దవారిని వేధించే సమస్య మలబద్ధకం. ఈ సమస్య ఉన్నవారు నీటిలో నానిన ఎండు అంజీర్లను తింటే విరేచనం సుఖంగా అవుతుంది.
3. హైబీపీ రోగులు ఎండు అంజీర్లు తింటే మంచిది. వీటిలో పొటాషియం అధికంగా ఉండి, సోడియం తక్కువగా ఉంటుంది.
4. బరువు తగ్గాలనుకునేవారికి అంజీర్లు మంచి పరిష్కారం. వీటిటో ఉండే ఫైబర్ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. రోజుకు నాలుగు అంజీర్లు తింటే చాలు... బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.
5. అంజీర్ పండ్ల వల్ల శృంగార సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. స్త్రీ, పురుషులిద్దరూ వీటిని తింటే మంచిది.
6. ఈ ఎండు పండ్లలో జింక్, మాంగనీస్, మెగ్నిషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. పోషకాహారలోపం తలెత్తదు.
7. పిల్లలకు వీటిని తినిపిస్తే చాలా మంచిది. ఇందులో అధికంగా ఉండే కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి.
8. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారు అంజీర్లు తింటే ఉపశమనం లభిస్తుంది.
9. అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎండు అంజీర్లను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
Read also: భోజనం మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Read also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి