By: ABP Desam | Updated at : 14 Dec 2021 07:37 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
శరీరంలోని ముఖ్యమైన అవయవం గుండె. దీని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలవాట్లు కూడా ఆరోగ్యంగానే ఉండాలి.తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారం, కార్డియో వాస్కులర్ వ్యాయామాలతో గుండెను కాపాడాకోవాల్సిన అవసరం ఉంది. కానీ మన చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె చిక్కుల్లో పడే అవకాశం ఉంది. గుండె ఆరోగ్యం కోసం కొన్ని అలవాట్లను దూరం పెట్టాల్సి ఉంటుంది.
ఒక్క దగ్గరే కూర్చోవద్దు
కొంతమంది గంటగంటలు చైర్లోనో, సోఫాలోనో కూర్చుని కదలరు. అక్కడే తిండి, నిద్ర, టీవీ చూడడం... ఇలా గంటల పాటూ ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం గుండెకు మంచిది కాదు. శరీరం ఎంత యాక్టివ్ గా ఉంటే గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఓ గంట నడవడానికి ప్రయత్నించండి.
ధూమపానం
స్మోకింగ్ కిల్స్ అని ఎన్ని ప్రకటనలు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. నిజానికి స్మోకింగ్ మీ గుండె పనితీరును మార్చేస్తుంది. సిగరెట్లలోని కార్బన్ మోనాక్సైడ్ గుండెకు, ఊపిరితిత్తులకు ప్రధాన శత్రువు. వీటిని పూర్తిగా మానేయడం మాత్రమే మంచి పరిష్కారం.
ఒత్తిడి
పని, కుటుంబం బాధ్యతలు, ఆర్ధిక సమస్యలు... ఇలా ఎన్నో కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గుండెపై ఈ ఒత్తిడి చాలా ప్రభావం చూపిస్తుంది. రక్తనాళాలైన ధమనులను డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల గుండె పోటు వచ్చే అవకాశం అనేక రెట్లు పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. వ్యాయామం చేయడం, ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రణలో ఉంచాలి.
జంక్ ఫుడ్
అనారోగ్యకరమైన, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం జంక్ ఫుడ్. ఇది తినేప్పుడు రుచిగానే ఉంటుంది, తిన్నాక మాత్రం శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి హానికరమైన మార్పులకు కారణం అవుతుంది.
మద్యపానం
గుండెపోటుకు కారణమయ్యే ప్రధాన కారకాల్లో ఆల్కహాల్ ఒకటి. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని ప్రేరేపిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ అనేవి కొవ్వుకు చెందిన ప్రమాదకరమైన మరో రూపం. రక్తనాళాలైన ధమనుల్లో రక్తప్రవాహానికి అడ్డుపడడం, శరీరం బరువు పెరగడం వంటి వాటికి దారితీస్తుంది. అందుకే మద్యపానం మానేయడం ఉత్తమం. బానిసలుగా మారిపోయాం... మానలేం అనుకునేవాళ్లు కనీసం తగ్గించండి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read also: భోజనం మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Read also: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల
Read also: థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!
Read also: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Waxing at Home : ఇంట్లోనే పార్లల్లాంటి వాక్సింగ్.. స్మూత్ స్కిన్ కోసం ఇలా చేయండి
Facts about Christmas : క్రిస్మస్ గురించి అమ్మబాబోయ్ అనిపించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. మీకు తెలుసా?
Diet Soda Drinks: డైట్ సోడా డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా? మీ కాలేయం ప్రమాదంలో పడినట్లే, నష్టలివే!
Instant Breakfast Recipe : బరువును తగ్గించే ఈజీ రెసిపీ.. దీనికి ఆయిల్ అవసరమే లేదు
Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?
Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం
Vizag tycoon junction politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
Spirit Movie : ప్రభాస్ 'స్పిరిట్'లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రి? ఇదిగో క్లారిటీ!
Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రలో బ్రహ్మణీ, దేవాన్ష్, మోక్షజ్ఞ
/body>