News
News
X

Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం

కొన్ని రోజుల కిందట దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు దాదాపు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.

FOLLOW US: 
 
Omicron Death In US: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఒమిక్రాన్. కొన్ని రోజుల కిందట దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు నమోదు కాగా.. ఇప్పటివరకు దాదాపు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. తాజాగా అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని కౌంటీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. టెక్సాస్‌లోని హారిస్‌ కౌంటిలో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు స్పష్టం చేశారు.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కారణంగా అమెరికాలో మొదటి మరణం నమోదు కావడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. అయితే, చనిపోయిన వ్యక్తి ఇప్పటి వరకు కొవిడ్19 టీకా తీసుకోలేదని వెల్లడించారు. అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని ఏబీసీ న్యూస్‌ రిపోర్ట్ చేసింది. యూఎస్‌లో తొలి కరోనా మరణంపై యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) స్పందించాల్సి ఉంది.

News Reels

చనిపోయిన వ్యక్తికి గతంలో కరోనా బారిన పడి కోలుకున్నాడు. కానీ అతడు కోవిడ్ టీకా మాత్రం తీసుకోలేదు. కరోనా కొత్త వేరియంట్‌ కారణంగా ఒకరు మృతి చెందారు. అమెరికాలో ఒమిక్రాన్‌ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని కౌంటీ మెజిస్ట్రేట్‌ లీనా హిడ్గాలో ట్వీట్‌ చేశారు. కనుక మీరు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోండి.. మీ ప్రాణాలతో పాటు కుటుంబసభ్యుల ప్రాణాలు కాపాడుకోవాలని ట్వీట్లో రాసుకొచ్చారు.
Also Read: Kidney Failure: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం 

అమెరికాలో ఇటీవల నమోదవుతున్న కరోనా కేసులలో 73 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులేనని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వెల్లడించింది. డిసెంబర్ మొదటి వారంలో బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇప్పటివరకూ బ్రిటన్ లో 12 మందిని ఒమిక్రాన్ వేరియంట్ బలిగొంది. మరో 104 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని డిప్యూటీ ప్రధాన మంత్రి డొమినిక్ రాబ్ టైమ్స్ రేడియోతో మాట్లాడుతూ తెలిపారు. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు 170 వరకు నమోదు కాగా, ఇది మరింత ప్రమాదకారిగా మారకముందే కొవిడ్19 టీకాలు తీసుకోవాలని వైద్య శాఖ, నిపుణులు సూచించారు.
Also Read: Beer: బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?

Also Read: Kunrool Call Money: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Dec 2021 09:02 AM (IST) Tags: coronavirus Omicron omicron cases First Omicron Death In US Omicron Death In US Omicron Deaths

సంబంధిత కథనాలు

US Landmark Bill: స్వలింగ సంపర్కుల వివాహాలకు లైన్ క్లియర్, యూఎస్ కాంగ్రెస్‌లో బిల్‌కు ఆమోదం

US Landmark Bill: స్వలింగ సంపర్కుల వివాహాలకు లైన్ క్లియర్, యూఎస్ కాంగ్రెస్‌లో బిల్‌కు ఆమోదం

Iran Hijab Protest: మహిళల మర్మాంగాలపై కాల్పులు, ఇరాన్ భద్రతా దళాల అరాచకం

Iran Hijab Protest: మహిళల మర్మాంగాలపై కాల్పులు, ఇరాన్ భద్రతా దళాల అరాచకం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

టాప్ స్టోరీస్

Bride kidnapped: రంగారెడ్డి జిల్లాలో పెళ్లి కూతురు కిడ్నాప్‌ కలకలం, ఇంటిపై 100 మంది యువకులు దాడి !

Bride kidnapped: రంగారెడ్డి జిల్లాలో పెళ్లి కూతురు కిడ్నాప్‌ కలకలం, ఇంటిపై 100 మంది యువకులు దాడి !

Revant On BRS : ఏపీ, తెలంగాణలను కలిపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ - బీఆర్ఎస్ పోటీ కోసమేనని రేవంత్ ఆరోపణ !

Revant On BRS :  ఏపీ, తెలంగాణలను కలిపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ - బీఆర్ఎస్ పోటీ కోసమేనని రేవంత్ ఆరోపణ  !

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Mukhachitram Review - 'ముఖచిత్రం' రివ్యూ : సినిమా చూశాక ప్రేక్షకుల ముఖచిత్రాలు ఎలా ఉంటాయంటే?

Mukhachitram Review - 'ముఖచిత్రం' రివ్యూ : సినిమా చూశాక ప్రేక్షకుల ముఖచిత్రాలు ఎలా ఉంటాయంటే?