Kunrool Call Money: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారుల వద్ద నూటికి రూ.10 వడ్డీ చొప్పున అప్పు తీసుకున్న ఓ వ్యక్తి వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక భార్యతో కలిసి ఆత్మహత్యకు యత్నించాడు.
కర్నూలు జిల్లా నంద్యాలలో కాల్ మనీ కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక నూర్ బాషా, షాహిన్ అనే దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేకనే చనిపోవాలనుకుంటున్నామని నూర్ బాష దంపతులు సూసైడ్ లెటర్ రాశారు. కుటుంబ అవసరాల కోసం నూర్ బాష స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద దాదాపు రూ.20 లక్షల వరకు అప్పులు చేశారు. నూటికి వారానికి పది రూపాయల చొప్పున అప్పులు తీసుకున్నాడు. వడ్డీ వ్యాపారుల వద్దనే చిట్టీలు వేసి కొంత వరకు అప్పులు తీర్చారు. కానీ కుటుంబ సమస్యల వల్ల అప్పులు తీర్చలేకపోయారు. దీంతో చేసిన అప్పులు తీర్చడం భారంగా మారిన తరుణంలో భార్యా ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే భార్య షాషిన్ పిల్లలతో పాటు సూసైడ్ చేసుకోవడాన్ని నిరాకరించింది. భార్యభర్తలే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఇంటి నుంచి బయటికెళ్లిన కొడుకు.. వచ్చి చూస్తే షాక్.. అసలేం జరిగిందంటే..?
'తల్లి గర్భం, సమాధి మాత్రమే ఆడపిల్లకు సురక్షితం'
చిన్నారులపై లైంగిక వేధింపులు ఆగడంలేదు. దేశంలో ఏదో ఓ చోట బాలికలు వేధింపులకు మృగాళ్ల చేష్టలకు బలైపోతున్నాయి. చెన్నైలో లైంగిక వేధింపులు భరించలేక ఓ పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ చిన్నారి రాసిన సూసైడ్ లేఖ కన్నీళ్లు పెట్టిస్తోంది. తల్లి కడుపులో లేదా సమాధిలో మాత్రమే ఆడపిల్ల సురక్షితంగా ఉందని సూసైడ్ నోట్ రాసి ఆ విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చర్చనీయాంశమైంది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు 21 ఏళ్ల కాలేజీ విద్యార్థిని లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేశారు. డిసెంబర్ 18, 2021న బాలిక తల్లి మార్కెట్ నుంచి తిరిగి వచ్చే సరికి ఉరి వేసుకొని చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో మూడు రోజుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి బాలికను లైంగికంగా వేధించాడని గుర్తించారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ బాలిక సూసైడ్ లేఖ అందరినీ కదిలించింది. స్కూల్ సురక్షితం కాదు, ఉపాధ్యాయులను కూడా నమ్మకూడదని నోట్‌లో పేర్కొంది. కలలో కూడా మానసిక హింసకు గురికావడం వల్ల తనకు నిద్ర పట్టడం లేదని లేఖలో రాసింది.
Also Read: షూ పాలిష్ పేరుతో నకిలీ టీ పౌడర్ తయారీ... భారీగా జీడి పిక్కల తుక్కు పట్టివేత...