By: ABP Desam | Updated at : 19 Dec 2021 09:17 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
జీడి పిక్కల పౌడర్ తో నకిలీ టీ పౌడర్
నకిలీ టీ పౌడర్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. జీడి పిక్కల తొక్కలతో టీ పౌడర్ చేస్తున్నట్లు తూర్పుగోదావరి పోలీసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో 2000లకు పైగా జీడిపిక్కల పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ టీ పౌడర్ తయారు చేసేందుకు జీడి పిక్కల తుక్కును వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనపర్తి నియోజకవర్గంలో రోజుకో విధంగా నకిలీ టీ పౌడర్ దందా బయటపడుతోంది. ఇటీవలే బిక్కవోలు మండలంలో భారీ స్థాయిలో నకిలీ టీ పౌడర్ చేస్తున్నట్లు తెలిపారు. షూ పాలిష్ తయారీ పరిశ్రమ పేరుతో అనుమతి తీసుకుని నకిలీ టీ పౌడర్ చేస్తున్నట్లు గుర్తించారు.
2000కు పైగా జీడి పిక్కల పౌడర్ బస్తాలు పట్టివేత
ఈ నకిలీ టీ పౌడర్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న కాళ్ళకూరి శ్రీనుకి సంబంధించిన అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలోని పాడుబడ్డ గోడౌన్లో భారీగా జీడిపిక్కల పౌడర్ ను గుర్తించారు. నకిలీ టీ పౌడర్ తయారుచేసేందుకు ముడి సరుకుగా వినియోగించే జీడి పిక్కల తొక్కల పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, దాడులు నిర్వహించారు. భారీ స్థాయిలో నకిలీ టీ పౌడర్ కి వినియోగించే ముడిసరుకు సుమారు 2000 పైగా బస్తాలను గుర్తించారు. నకిలీ టీ పౌడర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా బిక్కవోలు ఎస్ఐ పి.వాసు సంఘటనా స్థలం నుండి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు సమాచారం ఇవ్వడంతో సోమవారం వచ్చి శాంపిల్ సేకరించి కేసు నమోదు చేస్తామని చెప్పడంతో స్థానిక రెవెన్యూ అధికారులు గోడౌన్లని సీజ్ చేశారు.
Also Read: చిత్తూరు జిల్లాలో విషాదం... స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతు
తమిళనాడు ముఠా అరెస్టు
తమిళనాడు చెందిన ఓ ముఠా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఎస్‌ఆర్ పేటలోని ఓ రైసుమిల్లును లీజుకు తీసుకుని రెండేళ్లుగా నకిలీ టీ పొడి తయారు చేస్తున్నారు. ఎర్రమట్టి, జీడిపిక్కల తొక్కలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలిస్తున్నారు. వీటితో నిర్మా వాషింగ్ పౌడర్ కలిపి టీ పొడి చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే యంత్రాలను ఇక్కడి మిల్లులో పోలీసులు గుర్తించారు. ఇలా తయారుచేసిన టీ పౌడర్ కు రంగు, వాసన వచ్చేందుకు రసాయనాలు కలిపి ప్యాకింగ్ చేయిస్తారు. అక్కడి నుంచి వీళ్లు పట్టణాలు, గ్రామాలకు వెళ్లి టీ బడ్డీలు, చిన్న హోటళ్లు, బస్టాండ్లు, సినిమాహాళ్లు, రైల్వేస్టేషన్లు ఇతర రద్దీ ప్రదేశాల్లోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాను ఇటీవల పోలీసులు పట్టుకున్నారు.
Also Read: కొడుకును ఖననం చేసిన మరుసటిరోజే ఉరేసుకున్న తండ్రి.. సమాధి వద్దనే అఘాయిత్యం
Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, తల్లీ కొడుకు మృతి!
Cairo church Fire : కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం
Naina Jaiswal : నైనా జైస్వాల్ కు ఇన్ స్టాలో వేధింపులు, యువకుడు అరెస్టు!
Lovers Suicide: వాట్సాప్‌లో చాటింగ్, ఆపై పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య - అసలేం జరిగిందంటే !
Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు
Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు
Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు
మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!