By: ABP Desam | Updated at : 19 Dec 2021 02:51 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతు
చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు బాలురు గల్లంతు అయ్యారు. రేణిగుంట మండలం జి.పాళ్యం ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు బాలురు ఆదివారం ఉదయం స్వర్ణముఖి నదిలో కొండి కర్రలతో పడవ తయారు చేసి ప్రయాణం సాగించారు. అయితే ఒక్కసారిగా పడవ మునిగి పోవడంతో ముగ్గురు నదిలో కొట్టుకుని పోగా.. ఒక్కరు బయటపడ్డారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోనికి దిగిన పోలీసులు ముగ్గురు బాలురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలురు మునిగిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని రోధిస్తున్నారు.
ఆదివారం సెలవు కావడంతో నలుగురు చిన్నారులు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. నదిలో చేపలు పట్టేందుకు కొండి కర్రలతో ఓ పడవ చేసుకున్నారు. నలుగురు చిన్నారులు కలిసి పడవపై నదిలో కొంత దూరం ప్రయాణించారు. ఆకస్మాత్తుగా పడవ నీటిలో మునిగిపోయింది. ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ఒకరిని స్థానికులు కాపాడారు. మరో ముగ్గురిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.పాళ్యం వద్ద స్వర్ణముఖి నదిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
రేణిగుంట మండలం జి.పాళ్యం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన నిక్షిత్, గణేష్, ధోని, యుగంధర్ స్వర్ణముఖి నదిలో గల్లంతయ్యారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ నలుగురు విద్యార్థులు ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు నది వద్దకు వెళ్లారు. గ్రామానికి సమీపంలో స్వర్ణముఖి నది వంక ప్రవహిస్తోంది. ఇటీవల వర్షాలకు నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. నదిలో దిగిన విద్యార్థులు లోతు అంచనా వేయలేక ప్రవాహానికి కొట్టుకుపోయారు. నీటిలో కొట్టుకుపోతున్న నిక్షిత్ అనే విద్యార్థిని స్థానికులు కాపాడారు. మిగతా ముగ్గురు గణేష్, ధోని, యుగంధర్ గల్లంతవ్వడంతో వారి ఆచూకీ కోసం పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వెతుకుతున్నారు. ప్రమాదం విషయం తెలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షించారు. గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ముగ్గురు విద్యార్థులు గల్లంతవ్వడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read:
Kerala Doctor Suicide: BMW కార్ కట్నంగా ఇవ్వనందుకు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాయ్‌ఫ్రెండ్, 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య
NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్
Anantapur Crime: అనంతలో ‘దృశ్యం’ సినిమా స్టైల్లో యువకుడి మర్డర్
SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>