News
News
X

Nara Bhuvaneswari : వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !

అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి స్పందించారు. వారి క్షమాపణలు తమకు అక్కర్లేదని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు.

FOLLOW US: 

వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు చెబుతున్న క్షమాపణలు తమకు అవసరం లేదని.. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. తిరుపతిలో వరద బాధితులకు సాయం చేసే కార్యక్రమంలో  పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు తనపై చేసిన విమర్శలకు బాధపడ్డామని .. చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారన్నారు.  ఆ బాధ నుంచి బయటకు రావడానికి పది రోజుల సమయం పట్టిందన్నారు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిదని ... అక్కడ ప్రజా సమస్యల గురించే మాట్లాడాలన్నారు. ఇషఅటం వచ్చినట్లుగా మాట్లాడకూడదని..   వ్యాఖ్యానించారు.  ఆ వ్యాఖ్యల గురించి అదే పనిగా బాధపడే సమయం తమకు లేదన్నారు. 

Also Read: కోడి పందాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముద్రగడ లేఖ.. 5 రోజులు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్

తనను ఎవరో ఏదో అన్నారని అదేపనిగా బాధపడతూ.. టైం వేస్ట్ చేసుకోమని.. సమాజ సేవకు అంకితమవుతామని స్పష్టం చేశారు. పనిలేక విమర్శలు చేస్తున్నారని.. మహిళలను కించపరిచేలా ఎవరూ మాట్లాడకూడదన్నారు. అందరూ మహిళల్ని గౌరవించాలని సూచించారు.  అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబు కన్నీరు పెట్టుకుని.., మళ్లీ సీఎంగానే సభకు వస్తానని సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు. ఆ తర్వాత భువనేశ్వరి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. 

Also Read: మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?

వైఎస్ఆర్‌సీపీ నేతలు తర్వాత వరుసగా క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బహిరంగంగా తప్పు జరిగిందని.. మరోసారి అలాంటి మాటలు మాట్లాడబోనని క్షమాపణలు చెప్పారు. పలువురు వైసీపీ నేతలు కూడా భువనేశ్వరిపై అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే.. కన్నీళ్లతో కాళ్లు కడుగుతామని ప్రకటన చేశారు. మహిళలను కించ పరుస్తున్న వైసీపీ నేతల తీరును.. టీడీపీ గౌరవ సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో భువనేశ్వరి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 

Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోవచ్చిన వరద కారణంగా పెద్ద ఎత్తున జనం బాధితులయ్యారు. వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సాయం అందించారు.  కడప  జిల్లాలో అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 48 మంది చనిపోయినట్లుగా తేల్చారు. చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించారు.   చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితుల కుటుంబసభ్యులకు చెక్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో రూ. 48 లక్షలను... మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి పంపిణీ చేశారు.  

Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Dec 2021 02:58 PM (IST) Tags: ambati rambabu Kodali nani vallabhaneni vamsi Nara Bhuvaneswari YSRCP leaders' indecent remarks on Andhra Pradesh Bhuvaneswari

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు, ప్రత్యేకంగా ఆహ్వానించిన బ్రహ్మకుమారీలు

Breaking News Live Telugu Updates: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు, ప్రత్యేకంగా ఆహ్వానించిన బ్రహ్మకుమారీలు

సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై వైసీపీ నేత కుమారుడి పెత్తనం- ఆలస్యంగా వచ్చారని దూషణ

సచివాలయ సిబ్బంది, వాలంటీర్లపై వైసీపీ నేత కుమారుడి పెత్తనం- ఆలస్యంగా వచ్చారని దూషణ

Tirumala Rush: తిరుమలలో ఘనంగా పూలంగి సేవ, సాధారణంగా కొనసాగుతున్న రద్దీ!

Tirumala Rush: తిరుమలలో ఘనంగా పూలంగి సేవ, సాధారణంగా కొనసాగుతున్న రద్దీ!

Tirumala News: ఈ టైంలో తిరుమలకు వెళ్లొద్దు! ఆ తర్వాతే రావాలని భక్తులకు టీటీడీ సూచన

Tirumala News: ఈ టైంలో తిరుమలకు వెళ్లొద్దు! ఆ తర్వాతే రావాలని భక్తులకు టీటీడీ సూచన

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

టాప్ స్టోరీస్

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Hero Vishal: షూటింగ్ సెట్లో ప్రమాదం, తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్

Hero Vishal: షూటింగ్  సెట్లో ప్రమాదం,  తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు

ఉచిత పథకాలపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ- మోదీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం

ఉచిత పథకాలపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ- మోదీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం