AP Liquor Rates : మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?
ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా మద్యంపై వ్యాట్‌ను తగ్గించింది. దీంతో మద్యం రేట్లు తగ్గనున్నాయి. ఇక నుంచి ప్రముఖ బ్రాండ్లను కూడా అమ్మాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులపై కాస్త కనికరం చూపించింది. మద్యంపై వ్యాట్‌ను క్రమబద్ధీకరించింది. ఇలా చేయడం ద్వారా దాదాపుగా ఇరవై శాతం వరకూ మద్యం ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సవరించారు. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకు వరకు తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎల్ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది.
Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !
ఆంధ్రప్రదేశ్‌లో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం వెల్లువలా వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. సరిహద్దుల్లో ఎంత చెకింగ్ పెట్టినా అక్రమ మద్యం ఆపలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్‌ఈబీని ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. కానీ మద్యం రాక మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో రేట్లు తగ్గిస్తే అక్రమ మద్యానికి చెక్ పెట్టవచ్చన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే వ్యాట్‌ను క్రమబద్దీకరించినట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ప్రకటించారు.
Also Read: కర్నూలు వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత రాజకీయాలు.. జడ్పీ చైర్మన్ పదవికి మల్కిరెడ్డి రాజీనామా !
ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ బ్రాండ్లు కూడా లభించవు. అన్నీ ఓన్లీ ఫర్ ఆంధ్ర సేల్ బ్రాండ్లు మాత్రమే ఉంటాయి. ప్రముఖ కంపెనీల బ్రాండ్లు లేకపోవడం కూడా అక్రమ మద్యం విరివిగా ఏపీలోకి రావడానికి కారణం అవుతోంది. ఈ అంశాన్ని కూడా గుర్తించిన ప్రభుత్వం ప్రముఖ కంపెనీల బ్రాండ్లను కూడా అమ్మాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది .
ఏపీ ప్రభుత్వం మద్య నిషేధం చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ కారణంగానే ఏడాదికి ఇరవై శాతం చొప్పున దుకాణాలు తగ్గిస్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున మద్యం రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 37 శాతం మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పుడు వ్యాట్‌ను క్రమబద్దీకరించి రేట్లను తగ్గిస్తే మళ్లీ మద్యం అమ్మకాలు పెరిగే చాన్స్ ఉంది.
Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి