News
News
X

Kurnool ZP Chairman:కర్నూలు వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత రాజకీయాలు.. జడ్పీ చైర్మన్ పదవికి మల్కిరెడ్డి రాజీనామా !

కర్నూలు జడ్పీ చైర్మన్ పదవికి మల్కిరెడ్డి సుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఎర్రబోతుల పాపిరెడ్డికి ఇచ్చేందుకు హైకమాండ్ రాజీనామా చేయించినట్లుగా తెలుస్తోంది.

FOLLOW US: 

కర్నూలు జడ్పీ చైర్మన్‌ మల్కిరెడ్డి సుబ్బారెడ్డికి  వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. పదవి చేపట్టి రెండు నెలలు కాక ముందే  ఆయన పదవికి రాజీనామా చేయించింది. జడ్పీ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా మల్కిరెడ్డి సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు స్వయంగా రాజీనామా పత్రం అందించారు. ఆయన రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. మల్కిరెడ్డి సుబ్బారెడ్డి రాజీనామా వైఎస్ఆర్‌సీపీ అంతర్గత రాజకీయాలే కారణమని తెలుస్తోంది. 

Also Read: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ సభ...అమరావతిలో రాజధానికి వ్యతిరేకమని ప్రకటించిన మేధావులు

జిల్లా పరిషత్‌ ఎన్నికల సమయంలో చైర్మన్‌ పదవిని  ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. కొలిమిగుండ్ల జడ్పీ స్థానం నుంచి వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ ఆయన  కొవిడ్‌ బారిన పడి మరణించారు.  జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి మరణించడంతో ప్రత్యామ్నాయంగా మల్కిరెడ్డి సుబ్బారెడ్డికి పదవి ఇచ్చారు. అయితే ఇటీవలి ఉపఎన్నికల్లో కొలిమిగుండ్ల జడ్పీ స్థానం నుంచి ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు పాపిరెడ్డి ఏకగ్రీవంగా గెలిచారు. ఆయన తన కుటుంబానికి ఇస్తామన్న జడ్పీ చైర్మన్ పదవిని తనకివ్వాలని పట్టుబట్టారు. ఆయన వైఎస్ఆర్‌సీపీలోని కొంత మంది ముఖ్య నేతలకు బంధువు. కొ

Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !

లిమిగండ్ల మండలంలో  ఎర్రబోతుల కుటుంబానిదే ఆధిపత్యం. వారిని కాదంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని అక్కడి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హైకమాండ్‌పై ఒత్తిడి పెంచినట్లుగా తెలుస్తోంది. .సీఎం జగన్ వద్ద కూడా ఈ అంశంపై పంచాయతీ జరగడం..బనగాన పల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా పట్టుబట్టడంతో మల్కిరెడ్డితో రాజీనామా చేయించి .. పాపిరెడ్డికి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు నిర్ణయం జరిగిపోవడం.. హైకమాండ్ ఆదేశించడంతో మల్కిరెడ్డి రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. 

Also Read:  2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇక గురి తప్పదు.. అణుబాంబులను తీసుకెళ్లే అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్ !

సాధారణంగా పదవి ఇచ్చిన వారిని కనీస గౌరవంగా అయినా కొన్నాళ్ల పాటు ఉండేలా చూస్తారని కానీ మల్కిరెడ్డి సుబ్బారెడ్డికి మాత్రం ఆ అవకాశం హైకమాండ్ ఇవ్వలేదన్న అసంతృప్తి వారి వర్గీయుల్లో కనిపిస్తోంది. అయితే ఎర్రబోతుల కుటుబానికే జడ్పీ చైర్మన్ పదవి ఇస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి జగన్ మల్కిరెడ్డితో రాజీనామా చేయించారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. 

Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Dec 2021 04:59 PM (IST) Tags: YSRCP kurnool Kurnool Zadpi Chairman Malkireddy Subbareddy Subbareddy resigns YSRCP politics

సంబంధిత కథనాలు

YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా

Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా

పార్టీ నేతలే వెన్నుపోటుదారులు- టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆరోపణలు

పార్టీ నేతలే వెన్నుపోటుదారులు- టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆరోపణలు

Employee Selfi Video: ‘బాబోయ్, రెడ్డి రాజ్యంలో పని చెయ్యలేం’ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన, సెల్ఫీ వీడియో

Employee Selfi Video: ‘బాబోయ్, రెడ్డి రాజ్యంలో పని చెయ్యలేం’ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన, సెల్ఫీ వీడియో

టాప్ స్టోరీస్

CM Jagan: వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్

CM Jagan: వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Ysrcp Reactions : ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా ? టీడీపీపై వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహం !

Ysrcp Reactions : ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా  ? టీడీపీపై వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహం !

Fact Check: బీసీసీఐ ఛైర్మన్‌ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?

Fact Check: బీసీసీఐ ఛైర్మన్‌ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?