Tirupati: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ సభ...అమరావతిలో రాజధానికి వ్యతిరేకమని ప్రకటించిన మేధావులు
తిరుపతిలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ సభ జరిగింది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని రాయలసీమ మేధావులు, విద్యార్థి సంఘాలు అభిప్రాయపడ్డారు.
తిరుపతిలో శుక్రవారం అమరావతి రైతులు భారీ బహిరంగ సభ జరిగితే.. ఇవాళ మూడు రాజధానులకు మద్దతుగా సభ నిర్వహించారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ సభలో పెద్ద ఎత్తున నినదించారు. తిరుపతి ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సభలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన మేధావులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైతే నష్టపోతాయని స్పష్టం చేశారు.
Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !
అమరావతిలో రాజధానికి వ్యతిరేకం
రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఈ బహిరంగ సభకు అధ్యక్షత వహించారు. అమరావతిలో రాజధానికి తాము వ్యతిరేకమని సభలో మేధావులు, విద్యార్థి సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సీఎం జగన్ తీసుకొచ్చే సమగ్రాభివృద్ధి బిల్లుకు మద్దతు తెలుపుతామని ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు డిమాండ్, రాయలసీమ అవసరాలపై తిరుపతి ఇందిరా మైదానంలో ప్రజా రాజధానుల మహాసభ ఏర్పాటుచేశారు. రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలో రాయలసీమను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.
Also Read: 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇక గురి తప్పదు.. అణుబాంబులను తీసుకెళ్లే అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్ !
మూడు రాజధానులకు మద్దుతుగా రిలే దీక్షలు
రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షులు భూమన్ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అమరావతి నినాదం తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానుల ఉండాలని కోరారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రిలే దీక్షలు చేస్తామన్నారు. మూడు రాజధానుల కోసం మహా పాదయాత్ర చేస్తామన్నారు. తిరుపతి వికేంద్రీకరణ సభకు చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల నుంచి మేధావులు హాజరయ్యారు. కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్, రాయలసీమ మహాసభ అధ్యక్షుడు, రచయిత శాంతి నారాయణ, రాయలసీమ కార్మిక ఈ సభలో పాల్గొన్నారు.
Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి