Akilesh IT Raids : యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
యూపీలో ఎన్నికల వేడి ప్రారంభం అయింది. బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ నేతలపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. బీజేపీ కుట్ర చేస్తోందని అఖిలేష్ ఆరోపిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. యూపీలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీకు చెందిన ముఖ్య నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం వారణాసి నుంచి మావు చేరుకుని... సహదత్ పురలోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ నివాసంలో సోదాలు చేశారు. ఆయన పన్ను ఎగవేసినట్లు అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
మెయిన్‌పురిలోని ఆర్‌సీఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా లక్నోలోని జైనేంద్ర యాదవ్ నివాసంలో కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. వీరంతా అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితులే. ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి వీరంతా ఆర్థికంగా అండదండలు అందించే అవకాశం ఉందన్న కారణంగానే దాడులు చేశారని సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా
బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటోందన్నారు. కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ కూడా అదే దారిలో వెళ్తోందని.. కాంగ్రెస్ గత చరిత్రను చూడండి, ఎవరినైనా బెదిరించాలనుకుంటే, కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటూ ఉండేది. నేడు బీజేపీ కూడా అదే చేస్తోందని విమర్శించారు. రామ రాజ్యాన్ని తెస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైందని అఖిలేష్ విమర్శించారు.
Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ .. బీజేపీకి గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలపై ఆదాయపు పన్ను దాడులు జరగడం చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ ఐటీ దాడులకు.. రాజకీయాలకు సంబంధం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. యూపీలో ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించాయి.
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి