Covovax Vaccine Update: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన మరో వ్యాక్సిన్ కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి తెలిపింది.
భారత్ లో తయారు చేసిన మరో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం కరోనా వ్యాక్సిన్ కోవోవాక్స్‌కు అత్యవసర అనుమతిని మంజూరు చేసినట్లు ప్రకటించింది. యూఎస్ నోవావాక్స్ నుంచి లైసెన్స్ పొంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవోవాక్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు గ్లోబల్ వ్యాక్సిన్-షేరింగ్ సిస్టమ్ కోవాక్స్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నారు. తక్కువ ఆదాయ దేశాలలో ఎక్కువ మందికి టీకాలు వేయడానికి ఇది చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పునావాలా హర్షం వ్యక్తం చేశారు.
This is yet another milestone in our fight against COVID-19, Covovax is now W.H.O. approved for emergency use, showing excellent safety and efficacy. Thank you all for a great collaboration, @Novavax @WHO @GaviSeth @Gavi @gatesfoundation https://t.co/7C8RVZa3Y4
— Adar Poonawalla (@adarpoonawalla) December 17, 2021
Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
తక్కువ ఆదాయ దేశాలలో వ్యాక్సినేషన్
"కొత్త వేరియంట్‌లు వస్తున్నప్పటికీ వ్యాక్సిన్లు కోవిడ్ పై ప్రభావంతంగా పనిచేస్తాయి. SARS-COV-2 వైరస్ తీవ్రమైన అనారోగ్యం, మరణాల నుంచి ప్రజలను రక్షించడానికి టీకాలు అత్యంత ప్రభావవంతమైన వాటిల్లో ఒకటి" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మారియాంగెలా సిమావో అన్నారు. 'తక్కువ-ఆదాయ దేశాలకు వ్యాక్సిన్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. ఇప్పటికీ 41 తక్కువ ఆదాయ దేశాల్లో జనాభాలో 10 శాతానికి టీకాలు అందలేదు. 98 దేశాల్లో 40 శాతానికి కూడా చేరలేదు" అని ఆమె చెప్పారు. కోవోవాక్స్‌కు రెండు మోతాదులు అందిస్తారు. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ రిఫ్రిజిరేటెడ్ ఉష్ణోగ్రతల వద్ద వ్యాక్సిన్లను భద్రపరుస్తారు.
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
Also Read: తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు... 7కు చేరిన మొత్తం కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి