Srisailam Temple Shops Supreme Court : ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !
హిందూ ఆలయాల ప్రాంగణంలో ఉన్న దుకాణాల కోసం జరిగే వేలం ప్రక్రియలో అన్ని వర్గాలనూ అనుమతించాలని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం దుకాణాల విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చింది.

హిందూ ఆలయాల ప్రాంగణంలో ఉన్న దుకాణాల కోసం జరిగే వేలం ప్రక్రియలో అన్ని వర్గాలనూ అనుమతించాలని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. మతం ఆధారంగా దేవాలయాల ప్రాంగణాల్లో ఉన్న దుకాణాల కేటాయింపు తగదలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విస్పష్ట తీర్పు ఇచ్చింది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రధాన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం దేవాలయం ప్రాంగణంలోని దుకాణాలకు జరిగే వేలంలో కేవలం హిందువులే పాల్గొనాలని అన్యమతస్తులు పాల్గొనకడదని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై వ్యాపారులు న్యాయపోరాటం చేశారు.
గత ఏడాది డిసెంబర్‌లో శ్రీసైలం దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని.. అక్కడి దుకాణాల్లో అత్యధికం హిందూవేతరులే వ్యాపారాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రమైన ఆరోపణలు చేసి.. చలో శ్రీశైలంకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వం శ్రీశైలం ఆలయంలో ఉద్యోగం చేస్తున్న అన్య మతస్తులను బదిలీ చేసి.. హిందూవేతలు నిర్వహిస్తున్న వ్యాపారాలను ఖాళీ చేయించారు. షాపులను సీజ్ చేశారు. అగ్రిమెంట్ కాలపరిమితి ముగియడంతో 13 మంది ముస్లింల షాపులు సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారి పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.
Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
ఆ తర్వాత దుకాణాల వేలం జరిగింది. వేలంలో కూడా పాల్గొనే అవకాశాన్ని హిందూవేతర వర్గాలకు ప్రభుత్వం నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవోను పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ జీవోను సమర్థిస్తూ 2019లో ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది జనవరిలో స్టే ఇచ్చింది. కానీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేయలేదు.
సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదంటూ జానీబాషా, టీఎం రబ్బానీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.మతం, విశ్వాసం ప్రాతిపదికన ఆలయ దుకాణాల వేలంలో హిందూయేతరులు పాల్గొనడాన్ని నిరాకరించడం సబబుకాదని స్పష్టం చేసింది. ఆలయ ప్రాంగణాల్లో మత విశ్వాసాలకు విఘాతం కలిగించే మద్యం, గ్యాంబ్లింగ్ వంటివి అనుమతించరాదుగానీ పూలు, పళ్లు, చిన్నపిల్లల ఆటబొమ్మలకు సంబంధించిన దుకాణాల వేలంలో హిందూయేతరులను అనుమతించకపోవడం సరికాదనిని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Also Read: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

