Narendra Modi: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్.
ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్.. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. నేడు భూటాన్ నేషనల్ డే సందర్భంగా మోదీకి ఈ అవార్డు బహుకరించనున్నట్లు వెల్లడించింది.
ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా విపత్తు వేళ మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ 'నాడగ్ పెల్ గి ఖోర్లో' అవార్డును అందిస్తున్నట్లు భూటాన్ ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది.
'నాడగ్ పెల్ గి ఖోర్లో'గా పేర్కొనే ఈ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్చుక్.. మోదీకి బహుకరించాలని సూచించినట్లు తెలిపింది.
మోదీ అర్హులు..
Overjoyed to hear His Majesty pronounce Your Excellency Modiji’s @narendramodi name for the highest civilian decoration, Order of the Druk Gyalpo.https://t.co/hD3mihCtSv@PMOIndia @Indiainbhutan pic.twitter.com/ru69MpDWlq
— PM Bhutan (@PMBhutan) December 17, 2021
కృతజ్ఞతలు..
Thank you, Lyonchhen @PMBhutan! I am deeply touched by this warm gesture, and express my grateful thanks to His Majesty the King of Bhutan. https://t.co/uVWC4FiZYT
— Narendra Modi (@narendramodi) December 17, 2021
ఈ అవార్డు తనకివ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూటాన్ దేశం చూపిన ప్రేమకు ముగ్ధుడనయ్యానన్నారు.
Also Read: India's Omicron Tally: దేశంలో 100 దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో వ్యాప్తి
Also Read: Karnataka Congress MLA: 'స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అది జోక్ కాదండి.. బాధ్యత ఉండక్కర్లేదా?'
Also Read: Omicron Cases in Delhi: దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు
Also Read: Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి