Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్
మిస్ వరల్డ్ 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మిస్ ఇండియా మానసా వారణాసి సహా 17 మంది అభ్యర్థులకు కరోనా సోకింది.
మిస్ వరల్డ్ 2021 ఫినాలేపై కరోనా పంజా విసిరింది. మిస్ ఇండియా మనసా వారణాసి సహా ఈ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మొత్తం 17 మంది అభ్యర్థులకు కరోనా బారిన పడ్డారు. దీంతో పోటీలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మిస్ వరల్డ్ అధికారికంగా ప్రకటించింది.
View this post on Instagram
చికిత్స..
17 మంది అభ్యర్థులు సహా మరికొంతమంది సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది టీం. ఈ పోటీలు ప్యూర్టోరికో వేదికగా డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇలా జరగడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. రానున్న 90 రోజుల్లో పోటీలను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగమ్మాయి..
మిస్ వరల్డ్ 2021 పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మిస్ ఇండియా మానస వారణాసి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రస్తుతం ఆమె ప్యూర్టోరికోలో ఐసోలేషన్‌లో ఉన్నారు.
View this post on Instagram
తెలంగాణకు చెందిన మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. భారత్ తరఫున 70వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆమె ప్యూర్టోరికో వెళ్లారు.
Also Read: Congress MLA: అత్యాచారం అనివార్యమైతే హ్యాపీగా ఎంజాయ్ చేయడమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి