Watch Video: దటీజ్ మోదీ.. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన భారత ప్రధాని.. నెటిజన్ల ప్రశంసలు
తన కలల ప్రాజెక్టు అయిన కాశీక్షేత్ర అభివృద్ధి కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇటీవల అంకితం చేశారు. వారణాసి పర్యటనలో భాగంగా మోదీ తీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
PM Modi in Varanasi: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో నిర్మించిన 'కాశీ విశ్వనాథ్ కారిడార్' ఫేజ్ 1ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. డిసెంబర్ 13న తన కలల ప్రాజెక్టు అయిన కాశీక్షేత్ర అభివృద్ధి కారిడార్‌ను ప్రధాని మోదీ దేశ ప్రజలకు అంకితం చేశారు. రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానిద్ర మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు పని చేసిన అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు.
కాశీ విశ్వనాథ్ నడవా నిర్మాణంలో భాగస్వాములు అయిన కార్మికులను ప్రధాని మోదీ అప్యాయంగా పలకరించారు. వారితో కలిసి భోజనం చేయడం నెటిజన్లను ప్రధానంగా బాగా ఆకర్షించింది. ప్రధాని చేసే పనులను కొందరు విమర్శిస్తున్నారని, అయితే పెద్ద హోదాలో ఉన్నప్పటికీ తాను సేవకుడినేనని, అందరిలో ఒకడిననే భావన తీసుకొచ్చారని చెబుతున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఈ విషయాన్ని నిరూపించారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
Haters can call it ‘tokenism’ or whatever else they like, but how many of them would deny a chair and sit even with their domestic help on the same level? @narendramodi offers dignity to people. pic.twitter.com/M3sb79GdTp
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) December 16, 2021
కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన పని హాట్ టాపిక్ అవుతోంది. తనకు ప్రత్యేకంగా ఓ కూర్చీ వేసినప్పటికీ.. అక్కడికి వచ్చిన ప్రధాని మోదీ కూర్చీ తీసివేసి కార్మికులతో పాటు కూర్చున్నారు. కార్మికులను సైతం పక్కన వచ్చి కూర్చోవాలని ఆహ్వానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శెషాలీ వైద్య ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా విశేష స్పందన వచ్చింది.
హేటర్స్ ఆయనపై ఎన్నో ప్రచారం చేస్తుంటారు. కానీ ప్రధాని మోదీ ఏం చేశారో చూశారా. తనకంటూ ప్రత్యేకంగా వేసిన కూర్చీని పక్కకు తీసివేసి కార్మికులతో కలిసి కూర్చున్నారు. మీలో ఎంత మంది ఇంట్లో పనివాళ్లను ఇంతగా గౌరవిస్తున్నారు. వారి పక్కన కూర్చుని, పనికి విలువ ఇస్తున్నారని ట్వీట్లో రాసుకొచ్చారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 339 కోట్లు వెచ్చించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వారణాసిలో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. పవిత్ర గంగా నదిలో స్నానమాచరించారు. కార్మికులతో కలిసి భోజనం చేస్తూ వారితో ముచ్చటించారు.
Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కలల ప్రాజెక్ట్ సాకారం.. 'కాశీ విశ్వనాథ్ కారిడార్' ప్రారంభం