PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన తిరిగారు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.
ప్రధాని నరేంద్ర మోదీ.. వారణాసి పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం, ఆలయ దర్శనాలు, గంగా స్నానం ఇలా సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని. అయితే ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మోదీ కాశీ వీధుల్లో కాలినడకన తిరిగారు.
Inspecting key development works in Kashi. It is our endeavour to create best possible infrastructure for this sacred city. pic.twitter.com/Nw3JLnum3m
— Narendra Modi (@narendramodi) December 13, 2021
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కొంత సేపు నడిచారు. పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పనులను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
బనారస్ రైల్వే స్టేషన్..
Next stop…Banaras station. We are working to enhance rail connectivity as well as ensure clean, modern and passenger friendly railway stations. pic.twitter.com/tE5I6UPdhQ
— Narendra Modi (@narendramodi) December 13, 2021
ఆ తర్వాత మంగళవారం ఉదయం 1.23 నిమిషాలకు బనారస్ రైల్వే స్టేషన్‌ను మోదీ సందర్శించారు. ప్రయాణికుల కోసం ఉత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు
Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్
Also Read: ఈ బ్యాంకు హోమ్ , కార్ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి