By: ABP Desam | Updated at : 17 Dec 2021 10:35 AM (IST)
కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ (PC:PTI)
రాజకీయ నాయకులు నోరు జారి మాట్లాడడం తర్వాత నాలుక కర్చుకోవడం వంటి సందర్భాలు షరా మామూలే. కానీ, కొంతమంది మరీ దారుణమైన కామెంట్స్ చేసి క్షమాపణలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఓ రాజకీయ నాయకుడు మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం రేపాయి. ఆయన ఆ వ్యాఖ్యలను ఏకంగా అసెంబ్లీలో చేశారు. ఆ తర్వాత వివాదం బాగా రచ్చకెక్కడంతో దిగొచ్చి క్షమాపణలు కోరారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ అయిన కేఆర్ రమేశ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం ఎదురైన సందర్భంలో దాని నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయడమే ఉత్తమం అంటూ కేఆర్ రమేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. చర్చను పొడిగించాలని ఎమ్మెల్యేలు స్పీకర్‌పై ఒత్తిడి చేశారు. వారిని అదుపు చేయడం స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే కగేరీకి తలకు మించిన భారంలా అనిపించి ఇలా వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నింటినీ భరిస్తూ ‘అవును’, ‘అవును’ అంటూ ఉండాల్సి వస్తుంది. అంతే.. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి’’ అని ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ నవ్వుతూ అన్నారు.
దీనిపై కేఆర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ.. ‘‘అంతే.. అత్యాచారం ఎదురై అనివార్యమైనప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి’ అని ఓ సామెత ఉంది. మీరిప్పుడు సరిగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు’’ అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ ఫక్కున నవ్వారు. మరోవైపు, రమేశ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌గా మారింది. రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు సహా అంతా ఏకతాటిపై ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఒంటికాలుపై లేచారు. అందరూ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చివరికి ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ దిగిరాక తప్పలేదు. ‘‘అత్యాచారం అంశంపై అసెంబ్లీలో నేను నిర్లక్ష్యమైన, బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసినందుకు నేను క్షమాపణ కోరుతున్నా. అంతటి క్రూరమైన నేరాన్ని చిన్న చూపు లేదా తేలికగా చేయడం నా ఉద్దేశం కాదు, ఇకపై నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నడుచుకుంటాను. ప్రతిది ఆచితూచి మాట్లాడతాను.’’ అని కేఆర్ సురేశ్ కుమార్ ట్వీట్ చేశారు.
I would like to express my sincere apologies to everyone for the indifferent and negligent comment I made in today’s assembly about “Rape!” My intention was not trivialise or make light of the heinous crime, but an off the cuff remark! I will choose my words carefully henceforth!
— K. R. Ramesh Kumar (@KRRameshKumar1) December 16, 2021
Also Read: Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు
Congress: ఆ పదవికి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్, ఎందుకీ అసహనం?
Maharashtra Train Accident: మహారాష్ట్రలో రైలు ప్రమాదం, 50 మంది గాయాలు
PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్! కిసాన్ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!
Targeted Killing: కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవటం తప్ప వేరే దారి లేదు - పండిట్ల ఆవేదన
Bilkis Bano : "బిల్కిస్ బానో" కేసు దోషులందరూ రిలీజ్ - దేశవ్యాప్తంగా విమర్శలు !
KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్
Bigboss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6 కంటెస్టెంట్లు వీళ్లేనట, వాళ్లకు సెకండ్ ఛాన్స్?
YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే
Karthikeya 2 Box Office Collection : నిఖిల్ కెరీర్లోనే టాప్ - వసూళ్ళలో రికార్డు క్రియేట్ చేసిన 'కార్తికేయ 2'