Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు
కోర్టుల్లో బెయిల్ కోసం నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తోన్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన నకిలీ రబ్బరు స్టాంపులతో కోర్టులను మోసం చేస్తున్నారు.
సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్న ఐదుగురి ముఠాను గురువారం టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన రబ్బర్ స్టాంప్స్ తో పాటు ఇంటి ధ్రువీకరణ నకిలీ పత్రాలు, ఇంటి పన్ను రశీదులు, వివిధ వ్యక్తులకు సంబంధించిన ఆధార్ కార్డులు, పాస్ ఫొటో సైజు, మూడు సెల్‌ఫోన్లు, రూ. మూడు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వివరాలను వెల్లడించారు.
Also Read: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్
ఫోర్జరీ పత్రాలతో బెయిల్
పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరైనా రాజశేఖర్ అలియాస్ రాజేష్ నగరంలో ఒక లాయర్ వద్ద గుమాస్తాగా విధులు నిర్వహిస్తుండేవాడు. లాయర్ వద్దకు వచ్చే వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అవసరమయిన పత్రాలు, పూచికత్తు సంతాకాలను సులభంగా సృష్టించేందు రాజశేఖర్ మిగతా నిందితులను సంప్రదించేవాడు. దీంతో వాళ్లు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించిన పంచాయతీ రాజ్ రౌండ్ రబ్బర్ స్టాంపులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పేరు మీద హైదరాబాద్ లో తయారు చేయించిన రబ్బర్ స్టాంపులను వినియోగించుకుని బెయిల్ కోసం పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల పేర్ల మీద నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించేవాడు. నిందితులు బెయిల్ పత్రాలను కోర్టుకు అందజేసే సమయంలో ఫోర్జరీ పత్రాలతో పాటు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తులను న్యాయమూర్తి ముందు హాజరు పరిచేవాడు.
Also Read: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక సుబేదారి పోలీసులు కలిసి సుబేదారి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు రవీందర్ వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి రబ్బర్ స్టాంపులు గుర్తించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు చేస్తున్న నేరాలను అంగీకరించాడు. రాజేష్ ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేశారు. ఫోర్జరీ బెయిల్ పత్రాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టడంతోపాటు, స్వాధీనం చేసుకున్న ఫోర్జరీ పత్రాలను కోర్టుకు సమర్పించి బెయిల్ పొందిన నిందితులపై విచారణ చేపట్టనున్నట్లు, అదే విధంగా ఫోర్జరీ పత్రాల వ్యవహారాన్ని కోర్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పోలీస్ కమిషనర్ తరుణ జోషి తెలిపారు.
Also Read: ఫుల్ గ్యాస్‌తో ఉన్న సిలిండర్ల లారీ బోల్తా.. ! ఒక్కటి లీక్ అయినా పెను విపత్తే.. కానీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి