By: ABP Desam | Updated at : 16 Dec 2021 09:52 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మంచి అలవాట్లయినా, దురలవాట్లు అయినా ఓకే రకం అభిరుచులు ఉన్నవారి మధ్య స్నేహం త్వరగా కుదురుతుందని అంటుంటారు. ముఖ్యంగా మందుబాబులు, పేకాట రాయుళ్ల విషయంలో ఇది కాస్త ఎక్కువే ఉంటుంది. తాజాగా ముగ్గురు అపరిచిత వ్యక్తులు తమ అభిరుచి ఒకటే కావడం వల్ల స్నేహితులయ్యారు. వారు ముగ్గురూ డ్రగ్స్‌కు బానిసలు. అంతకుముందు ఒకరికొకరు పరిచయం లేని ముగ్గురు ఓ యాప్ ద్వారా కలుసుకొని డ్రగ్స్ తీసుకుంటూ రెచ్చిపోయారు. తాజాగా పోలీసులకు చిక్కారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురు వ్యక్తులు ఆన్‌లైన్‌లో స్నేహితులయ్యారు. అంతకుముందే మత్తు మందుకు అలవాటు పడ్డ వీరు.. తరచూ పబ్‌లో కలుసుకునే వారు. గోవాలో కొనుగోలు చేసిన డ్రగ్స్ పంచుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకునేవారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం సాయంత్రం కారులో మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వీరు అనుమానాస్పదంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందగా.. వారి దగ్గరికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో వారి వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. వారిలో మెహిదీపట్నం విజయ్ నగర్ కాలనీకి చెందిన హార్మోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మహమ్మద్ జమీర్ సిద్ధిఖ్ అనే 28 ఏళ్ల వ్యక్తి, హఫీజ్‌పేట్ గోపాల్ నగర్‌లోని శ్రీ రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పులి రమ్య అనే యువతి, అల్మాస్‌గూడ శేషాద్రి నగర్‌లో నివాసముంటున్న కౌకుంట్ల అఖిల్ అనే 31 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. వారి నుంచి వివిధ రకాల 9.4 గ్రాముల మాదక ద్రవ్యాలతో పాటు గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ ముగ్గురు ‘క్లబ్ హౌస్’ అనే ఆన్‌లైన్ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. యాప్‌లో డ్రగ్స్ గురించి మాట్లాడుకునేవారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో తరచూ కలుసుకునే వారు. ఇలా కలుసుకున్నప్పుడు డ్రగ్స్ పంచుకునే వారు. కౌకుంట్ల అఖిల్ గోవా వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి వచ్చేవాడు. దాన్ని మిగతా ఇద్దరికి ఇచ్చేవాడు. డిసెంబరు 31 రాత్రి వేడుకలు చేసుకునేందుకు జమీర్ సిద్ధిఖ్, పులి రమ్య ఈ నెల 9న గోవాకు వెళ్లి డ్రగ్స్ కొన్నారు. మంగళవారం అఖిల్‌కు డ్రగ్స్ ఇస్తున్న సమయంలో ఓఆర్ఆర్ వద్ద పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
Also Read: Farmer Suicide: కన్నబిడ్డలా చూసుకున్న పంట ఒడిలోనే.. రైతు రవీందర్ ఆత్మహత్య..
Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు.. త్వరలో పాదయాత్ర చేస్తా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
KPHB Techie Murder: అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు
Matrimony Sites Cheating : మాట్రిమోని సైట్ లో అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్, లక్షల్లో సమర్పించుకున్న బాధితులు!
Shamshabad Accident : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
Nizamabad Bank Robbery : బ్యాంకులో జులాయి సినిమా సీన్ రిపీట్, రూ.3 కోట్ల సొమ్ము చోరీ!
Raghu Rama House Reccy : ఎంపీ రఘురామ ఇంటి చుట్టూ రెక్కీ - ఒకరిని పట్టుకున్న సీఆర్పీఎఫ్ !
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్