Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
Cuttack SCB Hospital Fire Accident | ఒడిశాలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 10 మంది మృతిచెందగా, ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు. సీఎం మోహన్ చరణ్ మాఝీ బాధితులను పరామర్శించారు.

Cuttack Fire Accident | కటక్: ఒడిశాలోని కటక్ నగరంలో ఉన్న SCB మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రామా కేర్ ICUలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్2లో ట్రామా కేర్ ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది పేషెంట్లు చనిపోవడం విషాదాన్ని నింపింది. వీరిలో కొందరు ICUలోనే ఊపిరాడక మరణించగా, మరికొందరు తరలిస్తుండగా చనిపోయారు. ఇంకా 5 మంది పేషెంట్ల పరిస్థితి చాలా విషమంగా ఉంది. వీరిని కాపాడే ప్రయత్నం చేసిన ఆసుపత్రి సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది,
ఆసుపత్రిలో చేరిన పేషెంట్లు మృతి
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే SCB మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించారు. ఆసుపత్రికి చెందిన అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించినా ప్రయోజనం లేకపోయింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేగంగా చర్యలు తీసుకున్నారు. కానీ పొగ, మంటల కారణంగా చాలా మంది పేషెంట్లు ట్రామా కేర్ ఐసీయూలో చిక్కుకున్నారు. ICUలో చేరిన కొందరు పేషెంట్లను వెంటనే బయటకు తరలించారు. తీవ్రమైన హెల్త్ కండీషన్‌లో ఉన్న వారిని హాస్పిటల్‌లోని న్యూ మెడిసిన్ ICUకి తరలించారు.
#WATCH | Odisha: A fire broke out at Trauma Care ICU of S.C.B. Medical College and Hospital in Cuttack. Fire brigade present at the spot for firefighting operations. Visuals from the spot. More details awaited. pic.twitter.com/KZVF5wOy4V
— ANI (@ANI) March 16, 2026
సంఘటనా స్థలానికి ఒడిశా ముఖ్యమంత్రి, కటక్ కలెక్టర్
భారీ అగ్నిప్రమాదం తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్య కార్యదర్శి, కటక్ జిల్లా కలెక్టర్, DCP సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఎం మోహన్ చరణ్ న్యూ మెడిసిన్ భవనానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ SCB మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రామా కేర్ ICUలో అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించిన ఒడిశా సీఎం ఈ ఘటనపై చారణకు ఆదేశించారు. ప్రభావిత పేషెంట్లను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి మెరుగైన చికిత్సను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన ప్రతి మృతుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి 25 లక్షలు పరిహారం అందిస్తామని ప్రకటించారు.
చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులను సీఎం మోహన్ చరణ్ కలిసి వారికి అండగా ఉంటామన్నారు. బాధితులకు పూర్తి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన, ప్రభావితమైన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ, ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.
ఇది SCB మెడికల్ కాలేజ్ వంటి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ప్రమాదం జరగడంతో భద్రతా ప్రమాణాలపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మంటలు ఎలా చెలరేగాయి, ప్రమాదానికి కారణం ఏంటి.. అనే దానిపై దర్యాప్తు ప్రారంభమైంది.
ట్రెండింగ్ వార్తలు
























