News
News
X

Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు

ఆరుగాలం కష్టపడిన పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర రాలేదని ఓ ఉల్లి రైతు ఆగ్రహించాడు. మార్కెట్ లో అమ్మకానికి తెచ్చిన ఉల్లిబస్తాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు.

FOLLOW US: 
Share:

ఉల్లి రైతుకు ఆగ్రహం వచ్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్న ఆవేదన ఆగ్రహ జ్వాలలా మారింది. చివరకు పండించిన పంటకు నిప్పుపెట్టాడు రైతు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో కనిపించిన ఈ ఘటన అక్కడున్న వారందర్నీ కలిచివేసింది. కర్నూలు జిల్లాలోని పంచలింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఉల్లిని విక్రయించేందుకు కర్నూలు మార్కెట్ యార్డుకు  తీసుకొచ్చాడు. ఈనామ్ విధానంలో రూ.350 ధర పలకడంతో రైతు ఆగ్రహం కట్టలుతెంచుకుంది. తాను తెచ్చిన ఉల్లికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. చెమటోడ్చి పండించి పంటను నష్టానికి అమ్ముకోలేక తన ఉల్లికి నిప్పు పెట్టానంటూ బాధిత రైతు ఆవేదన వ్యక్తం చెందాడు. తోటి రైతులు.. వెంకటేశ్వర్లుకు సర్ది చెప్పి మంటలు ఆర్పేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని ఉల్లి రైతులు డిమాండ్ చేశారు. 

Also Read: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఈ-నామ్ లో మద్దతు ధర లభించడంలేదు

ఉల్లి ధరలు ఇటీవల నెల చూపులు చూస్తున్నాయి. కనీసం పెట్టుబడి ఖర్చులు అయినా రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. క్వింటాల్ ఉల్లికి రూ. 600 మాత్రమే చెల్లిస్తామని వ్యాపారులు అంటున్నారు. కానీ వాస్తవానికి అంతధర ఇవ్వడంలేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ లో ఉల్లికి గిట్టుబాటు ధర లభించండం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ-నామ్‌లో కొంతమందికి మాత్రమే మంచి ధరలు వస్తున్నాయని, మిగతా రైతుల పంటకు మద్దతు ధర లభించడం లేదని ఉల్లి రైతులు వాపోతున్నారు. 

Also Read: "హోదా" కోసం రాజీనామాలు చేద్దాం ..రా ! సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ !

స్పందించిన అధికారులు 

రైతు ఉల్లి బస్తాలకు మంట పెట్టిన ఘటన గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. రైతుకు క్వింటాకు రూ.700 ఇప్పిస్తామని చెప్పి శాంతింపజేశారు. కనీసం పెట్టుబడి కూడా రాకపోయేసరికి రైతు ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కేజీ రూ.50 పైగా పలికిన ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కనీసం గిట్టుబాటు ధర రావడంలేదని రైతుల ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు అధికారుల్ని కోరుతున్నారు.  

Also Read: ఏపీ హైకోర్టు పరిధిదాటి వ్యవహరిస్తోంది... తమిళనాడు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు !

Also Read: ఆర్‌ఎంపీ ప్రాక్టీసనర్‌... పాలిక్లీనిక్‌ ఓనర్... కథ అక్కడే అడ్డం తిరిగి అడ్డంగా బుక్కయ్యాడు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Dec 2021 10:13 PM (IST) Tags: Kurnool onion market kurnool market yard E-nam onion fire onion rates

సంబంధిత కథనాలు

Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి

Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

CM Jagan : రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్

CM Jagan : రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్

టాప్ స్టోరీస్

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?