Chandrababu : "హోదా" కోసం రాజీనామాలు చేద్దాం ..రా ! సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ !
ప్రత్యేకహోదా కోసం ఎంపీలందరూ రాజీనామా చేసి పోరాడదాం రావాలని జగన్‌కు చంద్రబాబు సవాల్ చేశారు. ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ రాజీనామాలు చేసేందుకు సిద్ధమని .. వైఎస్ఆర్‌సీపీ సిద్ధమా అని ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్ విసిరారు. మంగళగరిలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి చెందిన అంశాలపై వైఎస్ఆర్‌సీపీ అవకాశవాదంతో వ్యవహరిస్తూండటాన్ని తప్పు పట్టారు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు అంశాల్లో కేంద్రం వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నా స్పందించడంలేదని విమర్శించారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించిందని.. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు మాత్రం స్పందించలేదన్నారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారని చంద్రబాబు ప్రశ్నించారు.
Also Read : లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఎంపీలను గెలిపిస్తే మెడలు వంచి హోదా తీసుకు వస్తామనిజగన్ గతంలో చెప్పారని ప్రజలు, యువతకు హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. ఇది మోసం, దగా కాదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని.. అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ సవాలుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. హోదా వస్తే ఒంగోలు లాంటి పట్టణం హైద్రాబాద్ అవుతుందని నాడు జగన్ అన్నారన్నారు. ఈ సందర్భంగా హోదా గురించి జగన్ మాట్లాడిన వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు. హోదా వస్తే రాష్ట్రమే మారిపోతుందని జగన్ అనలేదా? అని ప్రశ్నించారు.
Also Read : ఉద్యోగులు రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదు... ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందం... సజ్జల కామెంట్స్
విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం చెబితే ప్రభుత్వం ఏం చేస్తోంది? విభజన హామీల అమలు విషయంలో సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. విశాఖకు రాజధాని తెస్తాం అంటున్న జగన్... రైల్వే జోన్ గురించి ఏమి చెబుతారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్‌కు ముందే సమాచారం ఉందని అయినా పట్టించుకోలేదన్నారు. మాయ మాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్‌లు వద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
Also Read: పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు... సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దు.
ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల మెడకు వైఎస్ఆర్‌సీపీ ఉరి తాళ్లు వేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని .. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు కూడా వస్తుందని జోస్యం చెప్పారు. గతంలో ప్రతిపక్ష నేతగాఉన్నప్పుడు జగన్ హోదా కోసం రాజీనామాలు చాలెంజ్ చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు చేయడం ఆసక్తికరంగా మారింది.
Also Read: కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి