Sajjala On OTS: ఉద్యోగులు రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదు... ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందం... సజ్జల కామెంట్స్
ప్రజలపై రిజిస్ట్రేషన్ భారం పడకుండా ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిని బలవంతం చేయడంలేదన్నారు.
ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిని బలవంత పెట్టలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటీఎస్ ను ఉచితంగా ఇవ్వాలని కొందరు ప్రశ్నిస్తున్నారని, వీళ్లంతా గత ప్రభుత్వం హయాంలో ఏమయ్యారన్నారు. శుక్రవారం అమరావతిలో మాట్లాడిన సజ్జల... ఓటీఎస్ పై వివరణ ఇచ్చారు. రుణాలు కట్టలేక పిల్లలకు ఇవ్వలేకపోతున్న కారణంగా ఈ సమస్యకు పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అందించే పథకం ఓటీఎస్ అన్నారు. దీనిలో ఎలాంటి దాపరికంలేదన్నారు. కానీ ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఓటీఎస్‌లో ఇతర ఛార్జీలు ఏంలేవన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ తో ప్రభుత్వానికి వచ్చే రూ. 6 వేల కోట్లు రావని సజ్జల వెల్లడించారు.
Also Read: పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు... సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దు.
ఓటీఎస్ పై ఎవరిని బలవంత పెట్టలేదు
ఓటీఎస్‌పై ఎవరినీ బలవంత పెట్టలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తిగా స్వచ్చందమన్నారు. ప్రజలకు ఇష్టమైతేనే ఓటీఎస్ వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రజలపై రిజిస్ట్రేషన్ భారం పడకూడదనే ఓటీఎస్ తీసుకొచ్చామన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్‌తో ప్రభుత్వంపై రూ.6 వేల కోట్లు భారం పడుతోందన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో స్కామ్ చేసిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో పేదలకు ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.
Also Read: ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం
రాజకీయ ప్రకటనలు సరికాదు
ఉద్యోగ సంఘాల హామీలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్‌సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పరిశీలిస్తున్నామన్నారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం కమిటీలు వేశామన్నారు. నెలరోజుల్లో కమిటీలు నివేదికలు ఇస్తాయని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ ప్రకటనలు చేయడం సరైంది కాదన్నారు. ఉద్యోగులు సంయమనం పాటించాలన్నారు. ఇలాంటి ప్రకటనలతో ఉద్యోగులకే నష్టమన్నారు. వారంలోపే పీఆర్‌సీ ప్రక్రియ పూర్తవుతుందని సజ్జల తెలిపారు.
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
Also Read: కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి