X

AP Govt: ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రస్తుతం ప్రతి లే - అవుట్‌లో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్నారు. అది కాకుండా మరో 5 శాతం అదనంగా స్థలాన్ని ఇకపై కేటాయించాల్సి ఉంటుంది.

FOLLOW US: 

ప్రైవేటు వ్యక్తులు కొత్తగా వేసే లే - అవుట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిబంధన విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొత్తగా వేసే లే - అవుట్లలో 5 శాతం స్థలాన్ని ఇకపై వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టుకు కేటాయించాలని నిబంధన విధించింది. అలా సాధ్యం కాదనుకున్న పక్షంలో ఆ లే - అవుట్ ప్రాథమిక విలువపై సదరు స్థలానికి డబ్బులైనా చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవోను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం జారీ చేసింది. ఈ మేరకు 2017 లే - అవుట్‌, సబ్‌ - డివిజన్‌ నిబంధనలను సవరించారు.

ప్రస్తుతం ప్రతి లే - అవుట్‌లో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వ్యాపారులు కేటాయిస్తున్నారు. అది కాకుండా మరో 5 శాతం అదనంగా స్థలాన్ని ఇకపై కేటాయించాల్సి ఉంటుంది. ఈ స్థలాన్ని పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నట్లు పురపాలకశాఖ వివరించింది. పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు వేసే లే - అవుట్లకు కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 

లేదంటే సదరు 5 శాతం స్థలం లే - అవుట్‌కు 3 కిలో మీటర్ల లోపు అయినా ఇవ్వొచ్చు. లే - అవుట్‌లో 5 శాతం స్థలాన్ని కేటాయించడం సాధ్యం కాదనుకుంటే అక్కడికి మూడు కిలో మీటర్ల దూరంలోపు అంతే విస్తీర్ణంలో స్థలాన్ని ఇవ్వొచ్చని పురపాలకశాఖ జీవోలో పేర్కొంది. స్థలం ఇవ్వాలని లేకుంటే లే - అవుట్‌లో ప్రాథమిక విలువపై (బేసిక్‌ వాల్యు) 5 శాతం స్థలానికి సరిపడ డబ్బులు చెల్లించొచ్చు. స్థలం లేదా డబ్బును జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని పురపాలకశాఖ పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

Also Read: OTS Issue: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..

Also Read: East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...

Also Read: East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ap govt New layouts in AP YSR jagananna colonies AP new lay outs AP New Layouts GO

సంబంధిత కథనాలు

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

ఉద్యోగులతో చర్చలకు వేసిన కమిటీపై విరుద్ధ ప్రకటనలు

ఉద్యోగులతో చర్చలకు వేసిన కమిటీపై విరుద్ధ ప్రకటనలు

Breaking News Live: బంజారాహిల్స్ లో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి

Breaking News Live: బంజారాహిల్స్ లో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి

Gudivada: నిజనిర్థారణ పేరుతో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు... రాజకీయ లబ్దికోసం ముందస్తు అరెస్టు చేయాలని కోరారు... డీఐజీ మోహన్ రావు

Gudivada: నిజనిర్థారణ పేరుతో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు... రాజకీయ లబ్దికోసం ముందస్తు అరెస్టు చేయాలని కోరారు... డీఐజీ మోహన్ రావు

Cyber Crime: మానవ బాంబుగా మారి సీఎంను చంపుతానని పోస్టు.... హైదరాబాద్ లో యువకుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

Cyber Crime:  మానవ బాంబుగా మారి సీఎంను చంపుతానని పోస్టు.... హైదరాబాద్ లో యువకుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో విషాదం... గడ్డ కట్టే చలికి ఇండియన్‌ ఫ్యామిలీ బలి

అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో విషాదం... గడ్డ కట్టే చలికి  ఇండియన్‌ ఫ్యామిలీ బలి

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!