X

Visakhapatnam: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

విశాఖలో బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన రౌడీ షీటర్ కు మహిళలు దేహశుద్ధి చేశారు. బాలికలకు పుస్తకాలు ఆశచూపి అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

FOLLOW US: 

విశాఖ మల్కాపురంలో రౌడీ షీటర్ కు మహిళలు దేహశుద్ధి చేశారు.  రౌడీ షీటర్ దోమానా చిన్నారావు పుస్తకాలు, పెన్నులు ఎరచూపి బాలికతో అసభ్యంగా ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బాలిక ట్యూషన్ టీచర్ కు తెలపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులకు పుస్తకాలు, ఇతర వస్తువులు ఇస్తానంటూ ఇంటికి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. 

Also Read:  చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారులో చెలరేగిన మంటలు... ఆరుగురు మృతి

బాలికలతో అసభ్య ప్రవర్తన

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్‌ చిన్నారావుకు పిల్లల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ బాలికలను ఇంటికి తీసుకెళ్లి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారంతా ఆగ్రహంతో చిన్నారావుకు బుద్ధి చెప్పారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను వారించి చిన్నారావును స్టేషన్ కు తరలించారు. 
Also Read:  మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

విద్యార్థులతో సొంతింటి పనులు చేయిస్తున్న టీచర్

చదువు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు పిల్లలతో సొంతంటి పనులు చేయిస్తున్న ఘటన అనంతపురంలో వెలుగుచూసింది. అనంతపురం పట్టణంలోని ఆదర్శ నగర్ లో విద్యార్థులతో భవన నిర్మాణ పనులను  చేయించారు. నిన్న సెలవు కావడంతో విద్యార్థులను ఆదర్శ్ నగర్లోని తన ఇంటి వద్దకు పిలిచి భవన నిర్మాణానికి కావలసిన సామాగ్రిని విద్యార్థులతో మోయించారు. ఈ విషయంపై స్థానికులు హెడ్ మాస్టర్ శివమ్మను ప్రశ్నించిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదని విద్యా హక్కు చట్టం చెబుతున్నప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు బేఖాతర్ చేస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అవసరాల కోసం చిన్నారులను ఉపయోగించుకోవడం గర్హనీయమని స్థానికులు అంటున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. గత వారంలో సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని ఓ మోడల్ స్కూల్ లో చిన్నారుల చేత పాఠశాలలోని నీటి ట్యాంక్ ను శుభ్రం చేయించారు.  ప్రమాదవశాత్తు పిల్లలు నీటి తొట్టిలో పడిపోతే ఎలా అంటూ ప్రధానోపాధ్యాయురాలని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. 

Also Read: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆటోను ఢీకొట్టిన జీపు, నలుగురి దుర్మరణం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: news Visakhapatnam Crime Rowdy Sheeter misbehaves Vizag news

సంబంధిత కథనాలు

Hyderabad: ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్

Hyderabad: ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్

Hyderabad: 7 నెలల పిల్లాడిపై శానిటైజర్ పోసి నిప్పు.. కన్న తల్లి నిర్వాకం, కారణం ఏంటంటే..

Hyderabad: 7 నెలల పిల్లాడిపై శానిటైజర్ పోసి నిప్పు.. కన్న తల్లి నిర్వాకం, కారణం ఏంటంటే..

Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య, ఆమె తెలివికి శభాష్ అంటున్న స్థానికులు

Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య, ఆమె తెలివికి శభాష్ అంటున్న స్థానికులు

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో విషాదం... సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా సూసైడ్... ఆత్మహత్యలపై అనుమానాలు...!

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో విషాదం... సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా సూసైడ్... ఆత్మహత్యలపై అనుమానాలు...!

Chain Snatching: హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్... ఒక్కడే ఐదు చోట్ల స్నాచింగ్... !

Chain Snatching: హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్... ఒక్కడే ఐదు చోట్ల స్నాచింగ్... !
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Hyderabad Microsoft : హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల గిఫ్ట్.. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ !

Hyderabad Microsoft :  హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల గిఫ్ట్.. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ !

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

T20 World Cup 2022: ఈ సారి తగ్గేదే లే! ఈ ప్రపంచకప్‌లోనూ పాక్‌తోనే టీమ్‌ఇండియా తొలి పోరు

T20 World Cup 2022: ఈ సారి తగ్గేదే లే! ఈ ప్రపంచకప్‌లోనూ పాక్‌తోనే టీమ్‌ఇండియా తొలి పోరు

Samantha: విడాకుల అనౌన్స్మెంట్.. పోస్ట్ డిలీట్ చేసిన సమంత..

Samantha: విడాకుల అనౌన్స్మెంట్.. పోస్ట్ డిలీట్ చేసిన సమంత..