మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
ఓ వ్యక్తి భార్యను చంపేందుకు ప్లాన్ వేశాడు. అది కూడా క్షుద్ర పూజలు చేసి చంపుతానని పూజలు మెుదలు పెట్టాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో క్షుద్రపూజల కలకలం రేగింది. భార్యను హతమార్చేందుకు ఓ ప్రబుద్ధుడు క్షుద్రపూజలు చేయించడం స్థానికంగా సంచలనంగా మారింది. కంప్యూటర్ యుగంలోనూ తాంత్రిక పూజలు చేయించడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఎక్కడో మారుమూల పల్లెలో కాదు జిల్లా కేంద్రానికి అతి దగ్గరలోనే ఈ పూజలు చేయించడం జరిగింది.
పాల్వంచ మండలం శేఖరబంజరకు చెందిన కుమార్ ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం ఆమెను వదిలేసి గోపిక అనే యువతిని నాలుగేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అనంతం ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బు మొత్తం తీసేసుకున్నాడు. డబ్బులు అయిపోయాక మరో మహిళను మూడో పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నాడు. వీరి బంధానికి అడ్డుగా ఉందని భావించి.. రెండో భార్య గోపికను అడ్డు తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు.
దీంట్లో భాగంగా ఆమెను హతమార్చేందుకు క్షుద్రపూజలు చేయించాడు. క్షుద్రపూజలు చేస్తూ.. రెండో భార్య గోపిక పాస్ పోర్ట్ ఫోటోను ఓ ముగ్గులో పెట్టాడు. దీన్ని గమనించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని విన్నవించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ అమాయక మహిళలను మోసం చేస్తున్న ఈ నిత్య పెళ్లి కొడుకు భార్యను చంపించేదుకు క్షుద్రపూజలను ఆశ్రయించిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారులో చెలరేగిన మంటలు... ఆరుగురు మృతి
Also Read: Anantapur: ప్రాణం మీదకు తెచ్చిన వీడియో గేమ్... ఆటకు అడిక్ట్ అయి అపస్మారక స్థితిలో విద్యార్థి
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు