Crime News: చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ ఎఫైర్.. భర్త వెళ్లగానే ఇంట్లోకి వచ్చేవాడు.. విషయం బయటకు తెలిసి..
ఓ మహిళ చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయటకు తెలిసింది.
చెత్త ఏరుకునే వ్యక్తి ఓ మహిళ ఇంటికి రోజూ వచ్చేవాడు. చిత్తు కాగితాలు ఏరుకునేందుకే కదా అని అనుకునేవారంతా. కానీ అతడు సరిగ్గా.. భర్త ఇంట్లోనుంచి బయటకు వెళ్లగానే వచ్చేవాడు. ఇది గమనించిన స్థానికులు.. వాళ్లిద్దరికి వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు. ఆ నోటా.. ఈ నోటా.. విషయం.. భర్తకు తెలిసింది. తప్పు ఎప్పటికైనా బయటపడుతందనే విషయం రుజువైంది. అయితే ఈ విషయంపై భార్యను భర్త ప్రశ్నించాడు. చేసేది తప్పు పని అని.. మానుకోవాలని చెప్పాడు. అయినా ఆ మాటలను భార్య పట్టించుకోలేదు. మళ్లీ అలానే కథ నడిపించింది. చివరకు.. ఇది రక్తపాతానికి దారి తీసింది. అసలు విషయంలోకి వెళ్తే..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో రెండు రోజుల క్రితం హత్య జరిగింది. ఓ పాడుబడ్డ ఇంట్లో.. వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ విషయం గుర్తించిన.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. దర్యాప్తు మెుదలుపెట్టారు. చనిపోయిన వ్యక్తి ఏపీకి చెందిన నాగరాజు(40)గా గుర్తించారు. షాద్ నగర్ లోనే నివసిస్తూ.. రోడ్ల పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వాడని.. దర్యాపులో తేలింది. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తుంటే.. పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. దర్యాప్తులో ముందుకు వెళ్తుంటే.. అనూహ్య విషయాలు బయటకు వచ్చాయి.
షాద్ నగర్ లో నివసించే ఓ మహిళ ఇంటి వైపు చిత్తకాగితాలు ఏరుకునేందుకు వెళ్లేవాడు నాగరాజు. అలా.. మహిళతో అతడికి పరిచయమేర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే.. చిత్తు కాగితాలు ఏరుకునే.. నాగరాజు ఆ ఇంట్లోకి వచ్చేవాడు. ఈ వ్యవహారం చాలారోజులు సాగింది. అయితే తప్పు చేస్తే.. ఎప్పటికైనా బయటకు వస్తుందన్నట్టుగానే.. ఈ విషయం బయటకు తెలిసింది. భార్య చేస్తున్న పని నిజమే అని నిర్ధారించుకున్నాడు భర్త. వివాహేతర సంబంధం పెట్టుకోవడం తప్పు అంటూ.. హెచ్చరించాడు. అయినా ఆమె.. భర్త మాటలు వినలేదు. దీంతో నాగరాజును చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
షాద్ నగర్ లోని ఓ పాడుబడ్డ ఇంట్లో నాగరాజు ఉండేవాడు. గురువారం రాత్రి.. అక్కడకు వెళ్లిన భర్త.. నాగరాజును కొట్టి చంపాడు. ఆ తర్వాత శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే నాగరాజు హత్యకు గురయ్యాడని దర్యాప్తులో తేలింది.
Also Read: Jagtial: ఆర్టీసీ బస్సు - కారు ఢీ.. ముగ్గురు దుర్మరణం, ఇద్దరు చిన్నారులు కూడా..
Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..