By: ABP Desam | Updated at : 05 Dec 2021 08:55 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
క్షణికావేశంలో భర్తపై కోపంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. భర్త తన భార్య జాకెట్ కుట్టడంతో అది అందంగా రాలేదని ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడడం విస్మయం కలిగిస్తోంది. వృత్తి రీత్యా టైలర్ అయిన భర్త.. భార్యకు ఓ జాకెట్ కుట్టించాడు. అది తాను అనుకున్నట్లుగా రాలేదని ఆమె తనువు చాలించింది. పూర్తి వివరాలివీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన అంబర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. అంబర్ పేట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీనివాసులు, టి.విజయలక్ష్మి(35) దంపతులు హైదరాబాద్‌లోని గోల్నాక తిరుమల నగర్ ప్రాంతంలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వృత్తి రీత్యా టైలరింగ్ పని చేసే శ్రీనివాస్.. దాంతో పాటు తన బైక్‌పై వేర్వేరు ప్రాంతాల్లో వీధుల్లో తిరుగుతూ చీరలు అమ్ముతుంటాడు. ఇంట్లో టైలరింగ్ పని చేస్తుంటాడు.
ఇందులో భాగంగా శనివారం భార్య కోసం శ్రీనివాస్ ఒక జాకెట్ కుట్టాడు. పూర్తయ్యాక అది తనకు నచ్చలేదని భార్య చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ తాను కుట్టిన బ్లౌజ్ కుట్లు విప్పి భార్యకు ఇచ్చేశాడు. నువ్వే నీకిష్టం వచ్చినట్లు, నచ్చినట్టు కుట్టుకో అని తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన చెందిన విజయలక్ష్మి తమ బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకొని గడియ పెట్టుకుంది. శ్రీనివాస్ మామూలుగా తన టైలరింగ్ పనిలో ఉండిపోయాడు. స్కూలుకు వెళ్లిన పిల్లలు మధ్యాహ్నం వచ్చి తలుపు తట్టినా తల్లి స్పందించలేదు. బలవంతంగా తలుపులు తీసి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: East Godavari Crime: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి రవాణా... పోలీసులకు ఎలా చిక్కారంటే..?
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు
Also Read: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లల్ని హత్య చేసిన వైద్యుడు... టీలో మత్తు మందు పెట్టి ఆపై దారుణంగా హత్య
Also Read: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు
SukhDev Singh: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య - తుపాకీతో కాల్చి చంపిన దుండగులు
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
మణిపూర్ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం
ఆన్‌లైన్‌లో మెక్సికన్ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>