East Godavari Crime: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి రవాణా... పోలీసులకు ఎలా చిక్కారంటే..?
పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా... వారి కళ్లుగప్పి గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో 715 కేజీల గంజాయిని తరలిస్తూ పోలీసులకు చిక్కారు.
గంజాయి రవాణాకు అక్రమార్కులు కొత్త దారులు వెదుకుతున్నారు. గంజాయి రవాణాకు ద్విచక్ర వాహనాల నుంచి లగ్జరీ బస్సులు వరకు దేనిని వదలడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న 715 కేజీల గంజాయి ప్యాకెట్లను రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. రావులపాలెం, కాజులూరు మండలాల పరిధిలో గంజాయి రవాణా చేస్తోన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న తమిళనాడు చెందిన ఇద్దరు వ్యక్తులను రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 715 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
72 లక్షల విలువగల 715 Kg ల గంజాయిని పట్టుకున్న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు.
— East Godavari Police, Andhra Pradesh (@EGPOLICEAP) December 4, 2021
గంజాయి అక్రమ రవాణాపై రాబడిన సమాచారం మేరకు SDPO అమలాపురం శ్రీ వై.మాధవ రెడ్డి గారి పర్యవేక్షణలో రావులపాలెం CI శ్రీ V.కృష్ణ, SI రావులపాలెం సిబ్బందితో రావులపాడు (1/3)#SayNoToDrugs @dgpapofficial pic.twitter.com/2RCjy9dw8A
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు
17 సంచుల్లో గంజాయి
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు మల్లయ్య దొడ్డి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై డీఎస్పీ వై.మాధవరెడ్డి, సీఐ వి.కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై బుచ్చిబాబు వాహన తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో రాజమండ్రి వైపు నుంచి తమిళనాడు వెళ్తోన్న మహీ ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీ చేశారు. అందులో 17 సంచులలో కట్టి ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమిళనాడుకు చెందిన మురుగన్ వీర మణికండన్, రంగస్వామి సెల్వం అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ట్రావెల్ బస్సుతో పాటు వారి వద్దనున్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ కొత్తపేట జి.ఎఫ్.సి మెజిస్ట్రేట్ హాజరుపరచగా నిందితులకు రిమాండ్ కు విధించారని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి రవాణాలో ఇతర వ్యక్తుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే యానంకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు కేజీల గంజాయిని మోటార్ సైకిల్ పై తరలిస్తుండగా గొల్లపాలెం పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లల్ని హత్య చేసిన వైద్యుడు... టీలో మత్తు మందు పెట్టి ఆపై దారుణంగా హత్య
Also Read: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు