X

Hyderabad Crime: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు

సెలబ్రిటీలను మోసం చేసి కోట్లు కొట్టేసిన శిల్పా చౌదరికి కోర్టు రెండు రోజులు పోలీసుల కస్టడీకి అప్పగించింది. తాజాగా మరో హీరో తనను రూ.3 కోట్లు మోసం చేసిందని శిల్పాచౌదరిపై ఫిర్యాదు చేశారు.

FOLLOW US: 

హైదరాబాద్‌లో కిట్టి పార్టీల పేరుతో కోట్ల రూపాయలు కొట్టేసిన శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. లగ్జరీ కార్లలో తిరుగుతూ తన భర్త పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిలా బిల్డప్ ఇస్తూ ప్రముఖులను మోసం చేసింది శిల్పా చౌదరి. తరచూ కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ సంపన్నులను టార్గెట్ చేసింది. సినిమా నిర్మాణం పేరుతో కోట్లు వసూలు చేసి నిండా ముంచేస్తుంది. ఇటీవల మహేశ్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని తమ వద్ద రూ.2.90 కోట్లు మోసం చేసిందని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. తాజాగా హీరో హర్ష్ కనుమల్లి తనను శిల్పా చౌదరి మోసం చేసిందని ఫిర్యాదు చేశాడు. తన వద్ద రూ.3 కోట్లు తీసుకుని ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  హర్ష్ కనుమల్లి ‘సెహరి’ సినిమాలో హీరోగా నటించాడు. రోజు రోజుకూ ఫిర్యాదు చేస్తున్న సెలబ్రిటీల లిస్ట్ పెరిగిపోతుంది.

Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్‌ మామూలుగా ఉండదు

హీరో సుధీర్ బాబు భార్యకు రూ.2.90 కోట్లు టోకరా 

శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ పై రాజేంద్రనగర్ కోర్టు విచారణ చేసింది. శిల్పా భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు బెయిల్ మంజూరు చేసింది. శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో నార్సింగి పోలీసులు శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం, శనివారం ఆమెను విచారించనున్నారు. శిల్పా చౌదరి బాధితుల్లో సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉన్నారు. కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా చౌదరి వారికి ఫేక్ బంగారం, నకిలీ చెక్కులు అంటగట్టింది. హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని వద్ద రూ.2.90 కోట్లు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. చెక్కు మార్చేందుకు బ్యాంక్‌కు వెళ్లిన ప్రియదర్శినికి అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇవాళ, రేపు పోలీసులు కస్టడీలో బాధితుల ఫిర్యాదులపై విచారించనున్నారు. 

Also Read: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ధనిక కుటుంబాల మహిళలే టార్గెట్

శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌ దంపతులు. పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లా్లో నివాసం ఉంటున్నారు. శిల్పా చౌదరి తనను తాను సినీ నిర్మాతగా, తన భర్తను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకొంటారు. తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ టాలీవుడ్‌ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ.. ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయని నమ్మిస్తుంటుంది. ఇలా పలువురి నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. లాభాలు ఎక్కడ అని అడిగితే ఏళ్లు గడుస్తున్నా మాట దాటవేస్తూ, బెదిరింపులకు దిగడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు. 

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Hyderabad crime Silpa Choudhry Hero Harsh kanumalli celebrities fraud

సంబంధిత కథనాలు

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Guntur Car Accident: గుంటూరు జిల్లాలో విషాదం... చెరువులో కారు బోల్తా, నలుగురు మృతి

Anantapur: అనంతపురం జిల్లాలో తప్పిన పెనుప్రమాదం... హెచ్ఎల్సీ వంతెన విరిగి కాలువలో పడిన కూలీల వాహనం... కూలీలను కాపాడిన స్థానికులు

Anantapur: అనంతపురం జిల్లాలో తప్పిన పెనుప్రమాదం... హెచ్ఎల్సీ వంతెన విరిగి కాలువలో పడిన కూలీల వాహనం... కూలీలను కాపాడిన స్థానికులు

Sperm Theft : స్పెర్మ్ దొంగతనం చేసి కవల పిల్లల్ని కన్నదట .. గగ్గోలు పెడుతున్న బిజినెస్ మ్యాన్ ! నమ్ముదామా ?

Sperm Theft :  స్పెర్మ్ దొంగతనం చేసి కవల పిల్లల్ని కన్నదట .. గగ్గోలు పెడుతున్న బిజినెస్ మ్యాన్ ! నమ్ముదామా ?

Nizamabad: నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.... పొలం అమ్మినవాళ్లు ఇబ్బంది పెడుతున్నారని కుటుంబం ఆందోళన

Nizamabad: నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం.... పొలం అమ్మినవాళ్లు ఇబ్బంది పెడుతున్నారని కుటుంబం ఆందోళన

East Godavari Crime: సోషల్ మీడియాలో భార్య ఫోటోలు.. పిల్లలకు ఎలుకల మందు పెట్టి తానూ తిన్న భర్త

East Godavari Crime: సోషల్ మీడియాలో భార్య ఫోటోలు.. పిల్లలకు ఎలుకల మందు పెట్టి తానూ తిన్న భర్త
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

Anand Mahindra Thanks KTR: నా చిరకాల స్వప్నం నేరవేరింది.. థ్యాంక్యూ కేటీఆర్.. హుందాగా స్పందించిన ఐటీ మంత్రి

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

TSRTC: ఈ సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీకి ఆదాయం అదుర్స్.. అదే బాగా కలిసొచ్చింది!

Chicken During Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...

Chicken During Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...