Aspirin: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
జ్వరాలు, ఒంటినొప్పులు తగ్గడానికి వాడే ఆస్పిరిన్ వల్ల గుండెకు చేటు అని చెబుతోంది ఓ కొత్త అధ్యయనం.
ఎక్కువ వాడుకలో ఉన్న ఔషధం ఆస్పిరిన్. ఈ ట్యాబ్లెట్లను జ్వరం, ఒళ్లు నొప్పులకు ఎక్కువగా వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం గుండె పోటు, ఛాతీ నొప్పి చికిత్సకు వాడుతుంటారు. అయితే కొత్త పరిశోధన ప్రకారం ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ధూమపానం, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు ఉన్న వాళ్లు ఈ ట్యాబ్లెట్లను అధికంగా వాడితే గుండె ఫెయిలయ్యే పరిస్థితి 26 శాతం పెరుగుతుంది. ఈ పరిశోధన ఫలితాలు ‘యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ హార్ట్ ఫెయిల్యూర్ జర్నల్’లో ప్రచురించారు. ఈ అధ్యయనాన్ని ఫ్రీబర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. ఈ అధ్యయన రచయిత బ్లెరిమ్ ముజాజ్ మాట్లాడుతూ ‘ఆస్పిరిన్ వల్ల గుండె కొట్టుకోవడం విఫలం చెందుతుందనే ఏర్పడుతుందని కొత్త అధ్యయనం తేలింది, అయితే ఆస్పిరిన్ కు, గుండె వైఫల్యానికి మధ్య సంబంధాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి లోతైన అధ్యయనం అవసరం. అంతవరకు ఆస్పిరన్ మందును పెద్దలకు సూచించేముందు వైద్యులు జాగ్రత్త వహించాలి’ అని చెప్పారు.
ఇలా సాగింది అధ్యయనం...
ఆ అధ్యయనం కోసం వేల మందిపై పరిశోధన చేశారు. అందులో 30,827 మంది వ్యక్తులు గుండె ఆగిపోయే ప్రమాదంలో ఉన్నారు. వీరంతా పశ్చి ఐరోపా, అమెరికాకు చెందిన వారు. వీరంతా ధూమపానం, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు. అలాగే 40 ఏళ్ల వయసుకు మించిన వారు. వీరిలో ఆస్పిరిన్ వాడిన వారిని, ఉపయోగించని వారిని రెండు విభాగాలుగా చేసి పరిశోధన నిర్వహించారు. వీరిలో 7,698 మంది ఆస్పిరిన్ వాడుతున్నారు. అయిదున్నర ఏళ్ల పాటు అధ్యయనం సాగింది. కాగా ఆస్పిరిన్ వాడుతున్న వారిలో 1330 మందిలో గుండె వైఫల్యం నమోదైంది. కానీ వాడని వారిలో ఎలాంటి సమస్యా లేదు.
ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు ఆస్పిరిన్ వాడుతున్నారు. అందుకే ఇది చాలా పెద్ద అధ్యయనంగా, షాకింగ్ ఫలితంగా అభివర్ణించారు డాక్టర్ ముజాజ్. ఆస్పిరిన్ వాడకంతో పాటూ ఇతర చెడు అలవాట్లు, ఆరోగ్యసమస్యలు ఉన్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదం 26 శాతం ఎక్కువగా ఉందని ముజాజ్ తెలిపారు. ఈ ఫలితాలను ధృవీకరించడానికి గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్న వారిపై మరిన్ని ట్రయల్స్ అవసరమని చెప్పారాయన. అంతవరకు మాత్రం అధికంగా ఆస్పిరిన్ ఉపయోగించవద్దని సూచించారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Read Also: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి
Read Also: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి