అన్వేషించండి

Salt: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి

ఉప్పు మన శరీరానికి ప్రధాన శత్రువు. చిటికెడు అధికంగా తీసుకున్నా అనేక జబ్బులు దాడి చేస్తాయి.

నిద్రలేమి సమస్య ఎక్కువైపోతున్న కాలం. చాలా మంది దీనికి కారణం పని ఒత్తిడి, పెరుగుతున్న మానసిక ఆందోళన అని చెబుతారు. అది నిజమే కావచ్చు, కానీ మరో సైలెంట్ కిల్లర్ కూడా ఉంది. అదే ఉప్పు. మీరు తినే ఆహారం ఉప్పు అధికంగా ఉంటే ఆ రాత్రికి నిద్ర సరిగా పట్టక పోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా వృద్ధులపై ఉప్పు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారు మిగతావారితో పోలిస్తే ఉప్పును సగానికి పైగా తగ్గించుకోవాలి. లేకుంటే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వీరు రాత్రిపూట రెండు మూడు సార్లు మూత్రానికి వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడల్లా నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇక వీరు ఉప్పు అధికంగా తింటే మూత్రం మరిన్ని ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు మళ్లిన వారు ఉప్పును చాలా తగ్గించుకోవాలి. 

అవసరమే కానీ...
ఉప్పు తినడం అవసరమే కానీ, అధికంగా తింటే మాత్రం అనర్థమే. సోడియం కోసం మనం ఉప్పును తింటాం. రక్తం పరిమాణాన్ని నియంత్రణలో ఉంచటంలో సోడియానిదే కీలక పాత్ర. ఆహారం ద్వారా ఉప్పు అధికంగా ఒంట్లో చేరితే రక్తంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల కణాల నుంచి నీరు వచ్చి రక్తంలో కలుస్తుంది. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. రక్తం ఎక్కువైతే మూత్రం కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దీంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. 

కేవలం వయసు మళ్లిన వారికే కాదు, ఏ వయసులో ఉన్నవారికైనా ఇదే జరుగుతుంది. అప్పుడు వారికి నిద్రకు భంగం కలుగుతుంది. వెంటనే నిద్రపట్టక ఇబ్బంది పడతారు. అంతేకాదు రక్తపోటు కూడా పెరుగుతుంది. దీని వల్ల ప్రశాంతంగా అనిపించక నిద్రపట్టదు. దీంతో కిడ్నీలు అధికంగా పనిచేయాల్సి వస్తుంది. రక్తంలో చేరిన నీటిని ఒంట్లోంచి బయటకు పంపించేందుకు అవి ప్రయత్నిస్తాయి. మొత్తమ్మీద ఉప్పు వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలకు ముప్పు తప్పదు. కాబట్టి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Read Also: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్

Read Also: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి

Read Also: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Best One-Year FD Rates : లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
Amla Juice : ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే బరువు తగ్గుతారా? చర్మం మెరుస్తుందా? నిజాలివే
ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే బరువు తగ్గుతారా? చర్మం మెరుస్తుందా? నిజాలివే
Japanese Beauty Secrets : తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి
తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి
Jeera vs Ajwain vs Methi Water : జీలకర్ర నీళ్లా? వాము నీళ్లా? మెంతుల నీళ్లా? ఉదయాన్నే ఏది తాగితే మంచిది?
జీలకర్ర నీళ్లా? వాము నీళ్లా? మెంతుల నీళ్లా? ఉదయాన్నే ఏది తాగితే మంచిది?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget