Hyderabad: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు!!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు. పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్ విల్లా్లో నివాసం ఉంటున్నారు. వీరు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు.
హైదరాబాద్‌లో దంపతులు చేసిన ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒంటిపై నగలు వేసుకొని లగ్జరీ కార్లలో తిరుగుతూ పలువురిని ముగ్గులోకి దింపి నిలువునా ముంచిన తీరు విస్మయం కలిగిస్తోంది. తెలుగు సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, తాను ఒక సినిమా నిర్మాత అంటూ చెలామణి అవుతుంది. తన భర్త పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అని బిల్డప్ కూడా ఇస్తుంది. ఈ పలుకుబడితో నిత్యం చుట్టుపక్కల ఆడవారిని ఆకర్షించి, తరచూ కిట్టీ పార్టీలు నిర్వహిస్తుంటుంది. సినిమా నిర్మాణం పేరుతో సంపన్నులని ముగ్గులోకి దింపి.. కోట్లు వసూలు చేసి, నిండా ముంచేస్తుంది. ఇలా పలువురిని రూ.కోట్లలో మోసగించిన ఘరానా కిలేడీ శిల్పా చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు. పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్ విల్లా్లో నివాసం ఉంటున్నారు. శిల్పా చౌదరి తనను తాను సినీ నిర్మాతగా, తన భర్తను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకొంటారు. తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ టాలీవుడ్ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ.. ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయని నమ్మిస్తుంటుంది. ఇలా పలువురి నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. లాభాలు ఏవని అడిగితే.. ఏళ్లు గడుస్తున్నా వాటి ఊసెత్తకుండా దాటవేస్తూ, బెదిరింపులకు సైతం దిగడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు.
వీరిద్దరూ కలిసి తాజాగా సహేరి అనే సినిమా కూడా తీశారు. కానీ, అది విడుదల కాలేదు. తమ డాబుదర్పాలతో నగరంలో వ్యాపారవర్గాలకు చెందిన సుమారు 20 మంది మహిళలతో శిల్పాచౌదరి తరచూ కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసేది. ఆమె ఉచ్చులో చిక్కిన మహిళలకు లాభాల ఆశ చూపి భారీగా డబ్బు వసూలు చేసింది. లాభాలు వస్తే వాటాలు ఇస్తామని, నష్టాలు వస్తే తీసుకున్న డబ్బుకు వడ్డీ కలిపి ఇస్తానంటూ అందర్నీ నమ్మించింది. నిజమని భావించి పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి రూ.1.05 కోట్లు, మంచిరేవులకు చెందిన రోహిణి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చారు. నెలల గడుస్తున్నా అసలు, వడ్డీ చేతికి రాకపోవటం, ఫోన్లకు స్పందించకపోవడంతో దివ్యా రెడ్డి ఈనెల 8న శిల్పాచౌదరి ఇంటికి వెళ్లారు.
తానిచ్చిన డబ్బు తిరిగివ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. శిల్ప తన వద్దనున్న బౌన్సర్లతో ఆమెను బెదిరించింది. దీంతో బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు శుక్రవారం శిల్ప దంపతులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున న్యాయస్థానం దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: ఫ్రెండ్ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్ లవ్‌స్టోరీ..!