X

Hyderabad Crime: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

సరూర్ నగర్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడుపై 27 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ. 93.62 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

FOLLOW US: 

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న భారీ దొంగతనం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన పాత నేరస్థుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు గఫార్ ఖాన్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కేజీ 805 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,90,000 నగదు, ఒక బైక్, 10 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం రూ.93,62,500 విలువ గల సొత్తును  స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతడు ఇప్పటికే 27 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని తెలిపారు.

Also Read: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!

పాత నేరస్థుడే మళ్లీ దొంగతనాలు

ఈ వివరాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సరూర్‌నగర్, సీసీఎస్ ఎల్‌బీ నగర్ పోలీసులు ఈ కేసులో నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ మహేశ్ భగవత్ తెలియజేశారు. నిందితుడు గఫార్ ఖాన్ అలియాస్ జిగర్ పాత నేరస్థుడని తెలిపారు. గతంలో రాచకొండ, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. 2018లో మలక్‌పేట పోలీసులు నిందితుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. 2019లో ఆదిబట్ల పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారన్నారు. అనంతరం జైలు నుంచి విడుదలయ్యాక 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ నేరాలకు పాల్పడినట్లు మహేశ్ భగత్ వెల్లడించారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను మరో నిందితుడు ఖాజా పాషాకి విక్రయించాడని తెలిపారు. ఈ డబ్బులను ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో ఖర్చు చేసేవారని పోలీసులు తెలిపారు.

Also Read:  హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

ఆన్ లైన్ వ్యాపారం పేరుతో మోసాలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురానికి చెందిన నాగేశ్వరరావు అంబేడ్కర్‌ వర్సిటీ ఎదురుగా నెట్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఆన్‌లైన్ సేవలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రి విక్రయించేవాడు. దీంతో స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. తాను ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నానని డబ్బులు పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రెట్టింపు అవుతాయని నమ్మించాడు. తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ తో ఓ యాప్‌ రూపొందించాడు. ముందు వేల రూపాయల పెట్టుబడులను వసూలు చేసి అనుకున్న సమయానికి తిరిగి ఇచ్చేవాడు. దీంతో నాగేశ్వరరావుపై నమ్మకం ఏర్పడింది. ఇలా చాలా మంది లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అదును చూసి బోర్డు తిప్పేశాడు. రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఊరి విడిచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు నాగేశ్వరరావు ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. 

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana news Hyderabad crime Crime News Saroor nagar theft

సంబంధిత కథనాలు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Amalapuram: పేరుకు ఎక్సైజ్ ఆఫీసర్.. బుద్ధి మాత్రం నీచం.. అసభ్యకర మాటలు! అక్కడ చేతులేస్తూ వెకిలి పనులు

Amalapuram: పేరుకు ఎక్సైజ్ ఆఫీసర్.. బుద్ధి మాత్రం నీచం.. అసభ్యకర మాటలు! అక్కడ చేతులేస్తూ వెకిలి పనులు

Hyderabad: రోజూ రాత్రి మేడపైకి వెళ్లొస్తున్న బాలిక.. ఒంటిపై పంటి గాట్లు, ఆరా తీసి షాకైన పేరెంట్స్!

Hyderabad: రోజూ రాత్రి మేడపైకి వెళ్లొస్తున్న బాలిక.. ఒంటిపై పంటి గాట్లు, ఆరా తీసి షాకైన పేరెంట్స్!

Crime News: డబ్బు కోసం పోలీస్‌ బాస్ వక్రమార్గం.. నకిలీ డీఎస్పీ పేరుతో కోట్లు మాయం..

Crime News: డబ్బు కోసం పోలీస్‌ బాస్ వక్రమార్గం.. నకిలీ డీఎస్పీ పేరుతో కోట్లు మాయం..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ

Nagarjuna: అవన్నీ పుకార్లే... నేను అలా అనలేదు! - నాగార్జున క్లారిటీ

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

XUV700 Deliveries: దేశంలో మోస్ట్ వాంటెడ్ కారు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

XUV700 Deliveries: దేశంలో మోస్ట్ వాంటెడ్ కారు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!