Anantapur: ప్రాణం మీదకు తెచ్చిన వీడియో గేమ్... ఆటకు అడిక్ట్ అయి అపస్మారక స్థితిలో విద్యార్థి
వీడియో గేమ్స్ కి అడిక్ట్ అయ్యి అనంతపురం జిల్లాలో ఓ బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నారు. రాత్రుళ్లు నిద్రపోకుండా గేమ్స్ ఆడేవాడని చివరికి ఇలా అయిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
కరోనా కారణంగా బోధనా విధానాలు మారాయి. ప్రత్యక్ష బోధనా పద్ధతులు పోయి ఆన్ లైన్ విధానాలు మొదలయ్యాయి. దీంతో ప్రతీ విద్యార్థికి సెల్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. ఆన్ లైన్ తరగతులకు మాత్రమే ఈ సెల్ ఫోన్లను వినియోగిండంలేదు విద్యార్థులు. ఆన్ లైన్ లో సులభంగా లభిస్తున్న గేమ్స్ కు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. కొంత మంది విద్యార్థులు ఈ గేమ్స్ అడిక్ట్ అయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది.
Also Read: ఆర్టీసీ బస్సు - కారు ఢీ.. ముగ్గురు దుర్మరణం, ఇద్దరు చిన్నారులు కూడా..
అపస్మారక స్థితిలో బాలుడు
సెల్ ఫోన్ లో నిత్యం గేమ్స్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ బాలుడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఫోన్ లో రోజూ ఓ గేమ్ ఆడుతూ అలవాటు పడిపోయాడు. ఇలా దాదాపు 3 నెలలుగా ఆడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి వద్ద స్పృహతప్పి పడిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి తల్లిదండ్రులను గుర్తు పట్టలేకపోతున్నాడు. కుమారుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆటకు అలవాటు పడటంతో నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలుడు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
Also Read: చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ ఎఫైర్.. భర్త వెళ్లగానే ఇంట్లోకి వచ్చేవాడు.. విషయం బయటకు తెలిసి..
'రెండు, మూడు నెలల నుంచి వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రి 12 గంటలకు అందరూ నిద్రపోయాక ఫోన్ తీసుకుని తెల్లవారుజాము వరకూ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ మధ్య తలనొప్పి బాగా వస్తుందని ఏడుస్తున్నాడు. పిల్లాడి తల కాస్త వాచింది. దీంతో ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడ స్కాన్ చేసి చూశారు. సెల్ ఫోన్ గేమ్స్ కి అలవాటు పడడం వల్ల ఇలా అయ్యిందని వైద్యులు అంటున్నారు.'--- బాలుడి తల్లిదండ్రులు
Also Read: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... డివైడర్ ను ఢీకొట్టిన కారు, ఐదుగురు మృతి
Also Read: East Godavari Crime: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా గంజాయి రవాణా... పోలీసులకు ఎలా చిక్కారంటే..?
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు
Also Read: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లల్ని హత్య చేసిన వైద్యుడు... టీలో మత్తు మందు పెట్టి ఆపై దారుణంగా హత్య