Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారులో చెలరేగిన మంటలు... ఆరుగురు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి కూడా మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Andhra Pradesh | 6 people died in a road accident on the Puthalapattu-Naidupeta road near Chandragiri zone, Chittoor; car caught fire due to oil leak
— ANI (@ANI) December 5, 2021
8 people were present in the car; 5 died on the spot & 3 were rushed to Ruia Hospital, where 1 more died: Inspector BV Srinivas pic.twitter.com/ei7p5ORBKs
విజయనగరం వాసులుగా భావిస్తున్న పోలీసులు
చిత్తూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మరొకరు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పి కారులో మృతదేహాలను బయటకు తీశారు. కారు నెంబరు AP39HA 4003గా గుర్తించారు. మృతులను విజయనగరం జిల్లాకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు.
జగిత్యాలలో కారు ప్రమాదం
తెలంగాణ జగిత్యాల జిల్లాలోని మోహన్ రావు పేట శివారు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ వెళ్తున్న ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనడంతో ఈ దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు డ్రైవర్ మరణించారు. కోరుట్ల మోమిన్ పురకు చెందిన దంపతులు, వారి ముగ్గురు పిల్లలు అనస్, అర్షద్, అజాహన్‌తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్షద్, అజాన్ మృతి చెందారు. వారితో బాటు డ్రైవర్ కూడా అక్కడిక్కడే మృతి చెందాడు. మరో బాలుడు అనస్ పరిస్థితి విషమంగా ఉంది. భార్యాభర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: వారెవ్వా.. ఇసుక మాఫియాను అరికట్టే పరికరం కనిపెట్టిన విద్యార్థిని