By: ABP Desam | Updated at : 05 Dec 2021 10:25 AM (IST)
శాండ్ థెఫ్ట్ డిటెక్టర్ కనిపెట్టిన విద్యార్థిని
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఉన్న కారణంగా ఇసుక అక్రమ రవాణా సైతం పెరిగింది. ఇసుక దొంగిలించడం ఓ విషయమైతే, అక్రమంగా ఇసుక తరలించే లారీలను వేగంగా నడపటం వల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు పరిష్కరించేందుకు, నష్ట పరిహారం అందించడం వల్ల ప్రభుత్వానికి సైతం ఆర్ధిక నష్టం జరుగుతుంది. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదు. అధిక ధరలకు అది కూడా బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఫోకస్ చేసినా ఎంతో కొంత ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది.
ఏపీ, తెలంగాణలో పలు చెరువులు, కాలువలు ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తవ్వడం ద్వారా గుంతలు ఏర్పడి పలువురు విద్యార్థులు, వ్యక్తులు అందులో మునిగి చనిపోయిన ఘటనలు జరిగాయి. అక్రమంగా ఇసుక తవ్వడం వల్ల వేలాది ఎకరాలు సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులకు అక్రమ కొరత ఏర్పడి శాపంగా మారుతోంది. సాధారణంగా అనుకునే స్థాయి కంటే నిల్వ అయ్యే నీటి సామర్థ్యం తగ్గడంతో రిజర్వాయర్ల సామర్థ్యం కూడా దెబ్బతింటోంది.
ఇసుకు అక్రమ రవాణా, ఇసుక మాఫియా గురించి న్యూస్ పేపర్లలో చదివి చలించిపోయిన సిరిసిల్ల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని అనీలా.. దీనికి ఎలాగైనా పరిష్కారం కనిపెట్టాలని భావించింది. టీచర్ పాకాల శంకర్ గౌడ్ సహకారంతో ఈ టెన్త్ క్లాస్ విద్యార్థిని శాండ్ థెఫ్ట్ డిటెక్టర్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎవరైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తుంటే స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో దాని సంబంధించి అలారమ్ మోగుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, దీని వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని తాను ఈ ప్రాజెక్టు చేసినట్లు విద్యార్థిని వివరించింది. ప్రమాదాలు సైతం తగ్గుతాయని చక్కగా తెలిపింది. ఓ ట్రక్కు, ఇసుక సేకరణ కేంద్రం, ఎమ్మార్వో ఆఫీసు, ఆధునికమైన టెక్నాలజీ ఆర్ఎస్ సెన్సార్ ఆర్ ఎఫ్ రిసీవర్, ఆర్ ఎఫ్ ట్రాన్స్ మీటర్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, కంప్యూటింగ్ టెక్నాలజీ ఉపయోగించాలని తెలిపింది. ఏదైనా వాహనం పర్మిషన్ లేకుండా ఇసుక కేంద్రానికి రాగానే ఇసుక చోరీ జరుగుతుందని స్థాని ఎమ్మార్వో ఆఫీసులో అలారమ్ మోగుతుంది. అనౌన్స్‌మెంట్ రాగానే అప్రమత్తమైన ఎమ్మార్వో ఆఫీసు సిబ్బంది ఇసుక మాఫియా ఆటకట్టించే అవకాశం ఉంది. పర్మిషన్ తీసుకోకుండా ఇసుక దందా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు తోడ్పుడుతుంది.
Also Read: Omicron Updates: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఆ విషయంలో కేంద్రం మీనమేషాలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మార్వో కార్యాలయంలో అనుమతి పత్రాన్ని తీసుకొని మాత్రమే ఇసుక రీచ్ ప్రదేశం లోకి వెళ్లాలి. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్లగానే ఎమ్మార్వో కార్యాలయానికి టెలి కమ్యూనికేషన్ ద్వారా ఇసుక దొంగిలిస్తున్నరనే సమాచారాన్ని ఆడియో రూపంలో ఆఫీసుకు చేరవేస్తుంది. ఈ శాండ్ థెఫ్ట్ డిటెక్టర్ పరికరం ప్రమాదాలను తగ్గించి, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడంతో దోహదం చేస్తుంది. తద్వారా సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తేలికగా వస్తుందనే ఉద్దేశంతో ఈ పరికరం తయారు చేసినట్లు విద్యార్థిని తెలిపింది.
Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..
TSPSC Group 4 Results: టీఎస్పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
BRS MLA Kaushik Reddy: గెలిచిన ఆనందంలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి షాక్, మరో కేసు నమోదు
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Telangana New CM: సాయంత్రం తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం- చాలా సింపుల్గా కార్యక్రమం!
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>