(Source: ECI/ABP News/ABP Majha)
Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆటోను ఢీకొట్టిన జీపు, నలుగురి దుర్మరణం
అనంతపురం జిల్లాలో రోడ్డు నెత్తురోడింది. బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని ఉలిగి దేవస్థానానికి వెళ్లి తిరిగి వస్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీళ్లంతా బ్రహ్మసముద్రం మండలం కోడిపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆటో డ్రైవర్ శేఖర్, మహేంద్ర, నాగమ్మ, రక్షితగా పోలీసులు గుర్తించారు. రాము, రూప, లక్ష్మి, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
హైదరాబాద్ లో లగ్జరీ కారు బీభత్సం
హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని రోడ్ నెంబర్ - 2లో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విలాసవంతమైన కారు బీభత్సం చేసింది. ఆ కారు మితిమీరిన వేగంతో వచ్చి, అదే సమయంలో రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఈ కారు ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందారు. చనిపోయిన వీరిని త్రిభువన్ (23), ఉపేందర్ (25) అనే వ్యక్తులుగా బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. వీరిద్దరు రెయిన్ బో ఆసుపత్రిలో ఉద్యోగులు అని తేల్చారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధరించారు. వాహన ప్రమాదానికి మద్యం తాగడంతో పాటు అతివేగం కూడా కారణమని పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం తర్వాత నిందితుడు కారును ఆపకుండా పరారయ్యాడు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లి ఆ కారును పార్క్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ అనుమానించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక మృత దేహలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారులో చెలరేగిన మంటలు... ఆరుగురు మృతి