Justice Chandru : ఏపీ హైకోర్టు పరిధిదాటి వ్యవహరిస్తోంది... తమిళనాడు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు !
ఏపీ హైకోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోందని తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విషయంలో హైకోర్టు తీరును విజయవాడలో జరిగిన మానవ హక్కుల సమావేశంలో విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల ఓటీటీలో విడుదల జైభీమ్ సినిమాలో హీరో సూర్య పాత్రను ఈయన స్ఫూర్తితోనే రూపొందించారు. ఆ విధంగా ఆయన గురించి అందరికీ తెలిసింది. ఆయన విజయవాడలో జరిగిన హ్యూమన్ రైట్స్ డే సభలో ప్రసంగించేందుకు వచ్చారు. ఆ సభలో హైకోర్టు తీరుపై విమర్శలు చేశారు.
Also Read : ఉద్యోగులు రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదు... ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందం... సజ్జల కామెంట్స్
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉనికిని కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తోందని.. శత్రువులు ,రాజకీయ ప్రత్యర్ధులు తో కాదు న్యాయ వ్యవస్థతో చేస్తోందని విమర్శించారు. అమరావతి భూముల విషయంలో ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని..ఇప్పుడు కోర్టులు న్యాయం చేయాల్సింది పోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో జడ్జిల పై వచ్చిన ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుందని ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయించి సిబిఐకి అప్పగించిందన్నారు. నలుగురిని అరెస్టు చేశారు మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నామన్నారు. మనం ఎక్కడికి పోతున్నాం అని ప్రశ్నించారు.
Also Read: పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు... సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దు.
ప్రభుత్వంలో ఏదైనా వ్యవస్థ కౌంటర్ ఫైల్ చేయకపోతే వాళ్లకి జరిమానా విధించవచ్చు.. మొన్న సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కౌంటర్ వేయకపోతే లక్ష రూపాయల జరిమానా విధించిందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో డివిజన్ బెంచ్ రేపు సమాధానం చెప్పకపోతే రాష్ట్రంలో ప్రెసిడెంట్ పాలన విధిస్తామని అంటారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు .. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదన్నారు. కోర్టులే ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేస్తాయి ..రాష్ట్రపతి పాలన విధిస్తారని విమర్శించారు. ఇవి తాను అనడ ంలేదని.. జుడిషియల్ ఆర్డర్ లో ఉందన్నారు.
Also Read: ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు ప్రవేశ పెట్టింది.. దీని మీద కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేశారు. ఈ బెంచ్ లో ఇద్దరు జడ్జిలకు అమరావతి లో భూములు కేటాయించారు. వారిని తప్పించమని ప్రభుత్వం కోర్టును కోరింది. కానీ కోర్టు వినలేదు. మామూలుగా అయితే బెంచ్ మారుస్తారని చంద్రు అభిప్రాయపడ్డారు. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుందని.. ప్రభుత్వం ఎలా ఆలోచించిందంటే ఇలాంటి జడ్జిలు న్యాయవ్యవస్థలో ఉన్నంత కాలము మనకు న్యాయం జరగదని అనుకుందని విశ్లేషించారు. ఆ జడ్జిలు రిటైర్ అయ్యే అంతవరకు మరలా బిల్లు పెట్టకూడదని భావించిందన్నారు. ఇలాంటి న్యాయమూర్తులు ప్రజల యొక్క మానవ హక్కుల్ని ఎలా కాపాడగలని ఆయన ప్రశ్నించారు.
Also Read: కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి