అన్వేషించండి

YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు..  త్వరలో పాదయాత్ర చేస్తా

రైతు రవికుమార్ ఆత్మహత్యపై టీఆర్ఎస్ సర్కారుపై వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రైతు ఆత్మహత్య అంశంపై నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.  దీన్ని నిరసిస్తూ ఆమె మీడియా మాట్లాడారు. రవికుమార్ ఆత్మహత్యపై శాంతియుతంగా దీక్షచేస్తుంటే అరెస్టు చేస్తారా..? అని షర్మిల ప్రశ్నించారు. రవికుమార్ కు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారని.. ఒక బిడ్డ పెండ్లి చేశారని తెలిపారు. ఇంకో బిడ్డ చదువుకుంటోందని.. కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వెల్లడించారు. ఆ అబ్బాయి  మెడికల్ ఖర్చు చాలా అవుతుందన్నారు.  పిల్లాడి మెడికల్ ఖర్చులు వైఎస్సార్ తెలంగాణ పార్టీ భరిస్తుందని చెప్పారు.

'రవికుమార్ దిగుబడి తక్కువగా రావడంతో నష్టానికి వరి ధాన్యం అమ్ముకున్నారు. ఇది ఆత్మహత్యా..కేసీఆర్ హత్యా..? వరి ఆకరి గింజ వరకు కొంటానని, ఇప్పుడు కేసీఆర్ కొనబోమని చెబుతున్నారు. కేసీఆర్ వరి వేసుకోనిచ్చి ఉంటే రవికుమార్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. ముమ్మాటికీ రవికుమార్ చనిపోవడానికి కారణం కేసీఆర్..చనిపోయిన రైతులను తిరిగి తీసుకురాలేరు. కేసీఆర్ రాజీనామా చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ఈ పాపం పోయేది కాదు.' అని షర్మిల విమర్శించారు.

కనీసం ఆ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. రవికుమార్ అబ్బాయి మెడికల్ కు ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తించకపోవడంతో 48 లక్షల రూపాయల అప్పుభారం ఆ కుటుంబంపై పడిందని తెలిపారు. అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.  
'కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వరి కొనని ముఖ్యమంత్రి అవసరమా..? ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి అవసరమా..? కేసీఆర్ కి ఏమి ఇవ్వడం చేతనైంది. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, వరి పంట కొనుగోలు, మూడెకరాల భూమి ఏది ఇవ్వడం కేసీఆర్ కు చేతకాదు.' అని షర్మిల విమర్శించారు.

బంగారు తెలంగాణ అని చెప్పి రైతులకు కేసీఆర్ బతుకు లేకుండా చేస్తున్నాడు. ఒక పంటకు మద్దతు ధర ఇచ్చిన తర్వాత ఆ పంట వేసుకోవద్దనే హక్కు ఎవరికి ఉంది..? మద్దతు ధర అంటే... మీరు ఈ పంట పండించండి ప్రభుత్వం ఈ ధరకు కొనుగోలు చేస్తుందని రైతుకు భరోసాను కల్పించాలి. మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీనిచ్చిన తర్వాత ఇప్పుడు వరి వేయవద్దనే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది..? ఒక సారి రైతులకు హామీనిచ్చిన తర్వాత వరి పంట కొనాల్సిన బాధ్యత మీకు లేదా..? వరి ధాన్యం కొనము అంటే కేసీఆర్ దగా కోరు అని ఒప్పుకుంటున్నారా..? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదా..?
                                                                                   - షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

కేంద్రంతో మాట్లాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని షర్మిల అన్నారు. ముందు సంతకాలు పెట్టి వచ్చి ఇప్పుడు రైతులను బాధపెడితే ఎలా...? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీలో డ్రామాలు, ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందని.. ఎలక్షన్ ఇష్యూగా చేయాలని కేసీఆర్ వడ్లు కొనబోమని చెబుతున్నారని షర్మిల ఆరోపించారు.

'త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తాం. ధాన్యం కొనుగోలు చేయకపోతే అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం. పాదయాత్రలో రైతుల వడ్లు కొనడం లేదని ప్రతి రోజూ మేం విన్నాం. రవికుమార్ అనే రైతు చనిపోతే ఒక్కరికైనా బాధ్యత లేదా..? వైఎస్సార్ బతికి ఉంటే ఇలా జరిగేదా..?' అని షర్మిల ప్రశ్నించారు.

Also Read: MP Aravind: కవిత ఎంపీగా పోటీ చేస్తారనుకుంటే ఎమ్మెల్సీ అయ్యారు.. 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకుంటా 

Also Read: Revant Reddy : అమరవీరుల స్థూపం కట్టేది ఆంధ్రా కంట్రాక్టరా ? కేసీఆర్‌కు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలన్న రేవంత్ రెడ్డి !

Also Read: వాళ్లు ఇచ్చేలా లేరు..మనమే ఆక్రమించుకుందాం.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టిన మహిళలు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget