MP Aravind: కవిత ఎంపీగా పోటీ చేస్తారనుకుంటే ఎమ్మెల్సీ అయ్యారు.. 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకుంటా
కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం 50 వేల రూపాయలు అందిస్తోందని.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాష్ట్రంలో చనిపోయిన వారి లెక్కలు సరిగ్గా లేవని ఆరోపించారు.
కొవిడ్ మేనేజ్ మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. చనిపోయిన వారి రికార్డు లేకపోవటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ తో చనిపోయిన వారి అప్లికేషన్స్ 446 వస్తే ఇప్పటి వరకు 161 వేరిఫికేషన్ చేశామన్నారు. 156 మందికి డబ్బులు అందాయి అని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కూడా స్పీడప్ చేయాలన్నారు.
'ప్రజలను, రైతులను, డ్వాక్రా మహిళలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. డ్వాక్రా మహిళలకు కేంద్రం ఇచ్చే 8 శాతం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 శాతం వడ్డీ రాయితీ ఇవ్వటం లేదు. నిజామాబాద్ మాదవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జీ కి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసినా రాష్ట్రప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు. వరి ప్రోక్యూర్ మెంట్ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. రైతుల మీద రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటం, ముందస్తు ప్రణాళికలు లేకపోవటంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10 శాతం 12 శాతం తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అన్నదాతలను ఆడుకుంటున్నారు.' అని అరవింద్ విమర్శించారు.
కేటీఆర్ రైతుల శ్రమను దోచుకుని వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న దొంగ అని అన్నారు ఎంపీ అరవింద్. రిసైకిల్ బియ్యం బ్లాక్ మార్కెట్ లో కేటీఆర్ ప్రమోయం ఉందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైస్ మిల్లులకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్ దందాలో ఎమ్మెల్యేల భాగం ఉందని అరవింద్ ఆరోపించారు. లేకపోతే రైస్ మిల్లుల వద్దకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొలత మిషన్ లో కూడా అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.
డమ్మీ రైస్ మిల్లులు పెట్టి రైస్ రిసైకిలింగ్ చేసి రైతులను మోసం చేస్తున్నారు. ఈ దందాకు అడ్డుఅదుపు లేకుండా పోయిందన్నారు అరవింద్. బాయిల్డ్ రైస్ మీద బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో 300 రూపాయలు ఇన్ సెన్ టీవ్ ఇస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వమే అన్నీ చేయాలంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలన్నారు. దళిత బంధు ఎటుపోయిందని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. కవిత వెళ్లే కేసీఆర్ ను దళిత బంధు గురించి అడగాలని అన్నారు. నిరుద్యోగ భృతి ఎటువెళ్లిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి, కేసీఆర్ ను ప్రశ్నించాలని అన్నారు.
ఎమ్మెల్సీ కవిత మళ్లీ ఎంపీగా పోటీ చేస్తుందని అనుకున్నా.. కానీ ఎమ్మెల్సీ అయ్యింది. కవిత ఎంపీగా నిలబడాలని కోరిక ఉండే అని అరవింద్ వ్యాఖ్యానించారు. నష్టపోయిన పంటకు రైతులకు ఏ రకంగా సాయం అందిస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు అరవింద్. రైతులకు ఏ పంట వేయాలో కేసీఆర్ చెప్పలేక కన్ఫూజ్ చేస్తున్నారని ఆరోపించారు. పసుపు రైతుల విషయంలో బీజేపీ చెప్పింది చేసిందన్నారు. గతేడాది రైతులకు మద్దతు ధర కూడా వచ్చేలా చేశామన్నారు. చివరికి వరి రైతులను కూడా నాశనం చేసేలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మూత బడిన షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు తెరవటం లేదని ప్రశ్నించారు అరవింద్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు సీఎం కేసీఆర్ అవసరమా.... రైతులకు ఒక్క పంటకైనా బోనస్ ఇచ్చారా సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లాకు ఒక్క ఫ్యాక్టరీ అయినా తీసుకొచ్చారా? అప్పట్లో ఎంత వరి ధాన్యం వచ్చినా మార్కెటింగ్ చేస్తామని మాటిచ్చారు. కేసీఆర్ ఏం చేశారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సీఎం కేసీఆర్ అక్టోబర్ 1న కేంద్రానికి లేఖ రాసి ఇచ్చారు. సీఎం హోదాలో సంతకం పెట్టి మరి ఇచ్చారు. మరి రైతులకు ప్రత్యామ్నయం ఏం చూపారు. రాష్ట్రంలో రైతులు ఏ పంటవేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. దాన్యం కొనమని కేంద్రం ఎక్కడా అనలేదు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎందుకు కేంద్రానికి రాసిచ్చావు. నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రజలు బాగు పడతారు. నాపార్లమెంట్ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకుంటా. నా తండ్రి డీఎస్ రికార్డును తిరగరాస్తా.
- అరవింద్, నిజామాబాద్ ఎంపీ
Also Read: Jagityala: జగిత్యాల మహిళపై గల్ఫ్ యజమాని వేధింపులు... దేశానికి తీసుకొచ్చేందుకు ఏజెంట్ రూ.లక్ష డిమాండ్