Revant Reddy : అమరవీరుల స్థూపం కట్టేది ఆంధ్రా కంట్రాక్టరా ? కేసీఆర్‌కు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలన్న రేవంత్ రెడ్డి !
అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్‌కు ఇచ్చారని .. కేసీఆర్ తెలంగాణ వాడో కాదో డీఎన్‌ఏ టెస్ట్ చేయాలన్నారు.
తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించే కాంట్రాక్ట్‌ను ఏ మాత్రం అనుభవం లేని ఆంధ్ర కాంట్రాక్టర్‌కు ఇచ్చారని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ నిర్మాణం నాలుగున్నరేళ్లు అయినా ఇప్పటికీ పూర్తి కాకపోగా అంచనాలను మాత్రం 120 కోట్లుకుపైగా పెంచుకున్నారన్నారు. ఇప్పటికీ స్థూపం పూర్తి చేయకుండా అమరవీరుల్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే అమరవీరులకు గుర్తింపు ఉంటుందని అనుకున్నామని కానీ కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.
Also Read : కలెక్టర్ చీర తడపకపోతే పేరు మార్చుకుంటా ... కలకలం రేపుతున్న గోనె ప్రకాష్ రావు కామెంట్స్ !
అమరులకు ఉద్యోగం, ఆర్ధిక సాయం, భూమి ఇస్తామని చెప్పారని.. అమరవీరుల స్థూపం ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్మిస్తామన్నారని రేవంత్ గుర్తు చేశారు. ఏడేళ్లయింది.. అమరవీరుల స్థూపం ఏదని రేవంత్ ప్రశ్నించారు. మొదటి మూడేళ్లు అసలు పట్టించుకోలేదని 2017లో రూ. 80 కోట్లు కేటాయించినట్లుగా ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఏజాది వరకూ పట్టించుకోకుండా 2018లోటెండర్లు పిలిచి.. ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించారన్నారు. కానీ ఆ తర్వాత కూడా పనులు ముందు సాగలేదన్నారు.
Also Read : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు లేవు.. వారంతా అక్కడి వాళ్లే.. మంత్రి హరీష్ రావు క్లారిటీ
రెండు సార్లు టెండర్లు వాయిదా వేసి.. కేపీసీ అనే కంపెనీకి కాంట్రాక్టర్ ఇచ్చారని.. ఈ కంపెనీ పూర్తి పేరు కామిషెట్టి పుల్లయ్య కంపెనీ కాగా ఇది ఆంధ్ర ప్రాంతంలోని ప్రొద్దుటూరు వాళ్లదని రేవంత్ వెల్లడించారు. పైగా ఈ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదని.. తప్పుడు సర్టిఫికెట్లతో పనులు అప్పగించారని ఆరోపించారు. టి.హబ్ నిర్మాణం పేరుతో నిధులు కొల్లగొట్టారని కాగ్ తేల్చినా అదే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. రూ. 63కోట్లతో ప్రారంభించి ఇప్పటికి మరో రూ. 127 కోట్ల అంచనా వ్యయం పెంచారని రేవంత్ పత్రాలు విడుదల చేశారు. అయినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని .. ఏడాదిలో చేయాల్సిన పనిని నాలుగున్నరేళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు. అమర వీరుల స్తూపం మొండి గొడలుగా నిలబడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Omicron in India: వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!
సీఎం పక్కనే ఉన్న సచివాలయం సందర్శన చేసి దసరా లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారని.. కానీ అమర వీరుల స్తూపం సంగతి ఎంటని ప్రశ్నించారు. అసలు ఆంధ్రా కాంట్రాక్టర్‌కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని.. తెలంగాణలో అర్హులు లేరా అని ప్రశ్నించారు. పిడికెడు ఆంధ్ర కాంట్రాక్టర్ లు తెలంగాణ నీ దోచుకుంటున్నారు అని చెప్పింది కేసీఆరేనని గుర్తు చేశారు. కేసిఆర్ అసలు తెలంగాణ వాడోకాదో తేల్చడానికి డీఎన్‌ఏ టెస్టు చేయాలన్నారు. అమరవీరుల స్థూపం అవినీతికి కేటీఆర్.. అతని మిత్రుడు తేలుకుంట శ్రీధరే కారణమని రేవంత్ ఆరోపించారు. ఇది బయటపడాలంటే విచారణ కమిటీ వేయాలన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వెలివేయలాలని .. సాంఘిక బహిష్కరణ చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎవరూ శుభకార్యాలకు పిలువొద్దు, వాళ్ళ పిల్లలకు పిల్లను ఎవరు ఎవ్వొద్దని పిలుపునిచ్చారు.
Also Read: Coivshield Third Dose : కోవిషీల్డ్ మూడో డోస్‌కు నో.. "సీరం"కు పర్మిషన్ ఇవ్వని కేంద్రం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి