By: Khagesh | Updated at : 21 Oct 2025 11:07 PM (IST)
ఎనిమిదవ వేతన సంఘం ( Image Source : Other )
8th Pay Commission : జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలులోకి రానుంది. ఉద్యోగులందరి మదిలో ఒకటే ప్రశ్న, 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత వారి ప్రాథమిక జీతం ఎంత పెరుగుతుంది. HRA అంటే ఇంటి అద్దె భత్యం ఎంత లభిస్తుంది. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారు.
దీని ఆధారంగా ప్రాథమిక జీతం, ఇతర అలవెన్సుల్లో ఎంత పెరుగుదల ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 చుట్టూ ఉండవచ్చని తెలుస్తోంది. ప్రాథమిక జీతం పెరగడం వల్ల HRA, DA వంటి అలవెన్సుల ప్రయోజనం కూడా లభిస్తుంది. పెద్ద నగరాల్లో HRA ఎక్కువ లభిస్తుంది, చిన్న నగరాల్లో తక్కువ. మొత్తం గణన ఎలా ఉంటుందో తెలుసుకోండి.
8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ప్రాథమిక జీతంలో పెరుగుదల ఉంటుంది. నివేదికల ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉంటుంది. దీన్ని అంగీకరిస్తే, ప్రస్తుత ప్రాథమిక వేతనం దాదాపు మూడు రెట్లు పెరగవచ్చు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక వేతనం రూ. 20000 అయితే, కొత్త ప్రాథమిక వేతనం దాదాపు రూ. 57200 కావచ్చు. అదేవిధంగా, తక్కువ గ్రేడ్ ఉద్యోగుల జీతం కూడా బాగా పెరుగుతుంది. ప్రాథమిక వేతనం పెరగడం వల్ల DA, HRA వంటి ఇతర అలవెన్సుల్లో కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ మార్పు ద్రవ్యోల్బణం, రోజువారీ అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది.
HRA అంటే ఇంటి అద్దె భత్యం నగరం ఆధారంగా నిర్ణయమవుతుంది. X కేటగిరీ మెట్రో నగరాల్లో HRA 27%, Y కేటగిరీ మధ్యతరహా నగరాల్లో 18%, Z కేటగిరీ చిన్న నగరాల్లో 9% ఉంటుంది. 8వ వేతన సంఘంలో ప్రాథమిక జీతం పెరగడంతోపాటు HRA కూడా ఇదే నిష్పత్తిలో పెరుగుతుంది. అంటే పెద్ద నగరాల్లో అద్దె భారం తగ్గుతుంది. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న నగరాల్లో శాతం తక్కువగా ఉండవచ్చు. కానీ ఉద్యోగులు ఈ మార్పుతో ద్రవ్యోల్బణం, ఖర్చుల నుంచి ఉపశమనం పొందుతారు.
8వ వేతన సంఘంలో 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటుందని అనుకుందాం. దీని ప్రకారం, లెవెల్ 1 నుంచి 3 వరకు గణన చూద్దాం. లెవెల్ 1లో ప్రస్తుత ప్రాథమిక వేతనం రూ. 18000 అయితే, కొత్త ప్రాథమిక వేతనం దాదాపు రూ. 51480 అవుతుంది. అదేవిధంగా, Z, Y, X కేటగిరీ నగరాల్లో HRA దాదాపు రూ. 4,633, రూ. 9,266, రూ. 13,890 ఉంటుంది. లెవెల్ 2లో ప్రస్తుత ప్రాథమిక వేతనం రూ. 19900 అయితే కొత్త ప్రాథమిక వేతనం రూ. 56914 అవుతుంది.
అదే సమయంలో HRA దాదాపు రూ.5122, రూ.10244, రూ. 15366 వరకు చేరుకుంటుంది. లెవెల్ 3లో రూ. 21700 ప్రాథమిక వేతనం పెరిగి రూ.62062 అవుతుంది. HRA Z/Y/X నగరాల్లో దాదాపు రూ5586, రూ. 11171, రూ. 16758 ఉండవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేయలేదు. వీటిలో మార్పులు కూడా ఉండవచ్చు.
Zoho Pay App : జోహో సంచలన నిర్ణయం- ఫోన్‌పే,గూగుల్ పేకు పోటీగా UPI యాప్!
New Bank Rule:బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలని ఎలా సెట్ చేయాలి? సులభమైన స్టెప్స్‌లో ప్రక్రియ పూర్తి చేయండి!
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
Unclaimed Money in Indian Banks: దేశ బ్యాంకుల్లో క్లైమ్ చేయని డబ్బు ఎంత ఉంది? ఏయే రంగాలలో ఉంది?
Gold Prices : బంగారం అతిగా కొంటే ప్రమాదమే! త్వరలోనే ధరల పతనం; నిపుణులు ఏం చెబుతున్నారు?
Kurnool Bus Accident Effect: కర్నూలు ఘటనతో అలర్ట్.. ప్రయాణికులకు సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేసిన TGSRTC
No Income Tax: ఆ దేశాల్లో ఒక్క రూపాయి కూడా Tax కట్టనవసరం లేదు, ఓసారి లిస్ట్ చూడండి
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 49 రివ్యూ... కళ్యాణ్ వేషాలు... రీతూపై పచ్చళ్ల పాప రివేంజ... దువ్వాడ మాధురికి తనూజ ఝలక్
Gopichand 33: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్లో గోపీచంద్... ఇంటర్వెల్‌కు హైలైట్!