6 Ball Over Behind Story | 6 బాల్ ఓవర్ కోసం ఇంగ్లండ్-ఆసీస్ మధ్య దశాబ్దాల ఫైట్ జరిగిందా? | ABP Desam
క్రికెట్లో ఒక ఓవర్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? ఒక్కటే బాల్ ఉంటది.. 6 సార్లు వేస్తారని తిక్క ఆన్సర్లు చెప్పకండి. 6 బంతులుంటాయి అవునా? కానీ 6 బంతులు కాదు.. 4 బంతులే ఉంటాయి అని నేనంటే..?...... అసలు 4 కూడా కాదు.. 8 బంతులుంటాయంటాను. ఏమంటారు? ఇదంతా విని.. ‘పిచ్చండి ఇది’ అనకండి. నిజంగానే. ఓవర్‌కి 4 బంతులు, 8 బంతుల ఓవర్లతో ఒకప్పుడు పెద్ద పెద్ద టోర్నీలు కూడా జరిగేవి. అయితే అసలు ఆ ఓవర్లు ఏమైపోయాయి? ఎందుకు ఆపేశారు? అండ్ వాటి ప్లేస్‌లో 6 బంతుల ఓవర్లు స్టాండర్డ్ ఎందుకు చేశారు? పదండి ఈ రోజు స్పోర్ట్స్ టేల్స్‌లో తెలుసుకుందాం. ఒక ఓవర్ అంటే 6 బంతులు. అంతేగా? కానీ వందల ఏళ్ల చరిత్ర ఉన్న క్రికెట్‌లో ఈ '6 బంతుల' రూల్ అంత ఈజీగా రాలేదు. ఒకప్పుడు ఒక ఓవర్లో ఎన్ని బంతులు ఉండాలనేదానిపై స్పెసిఫిక్ రూల్స్ ఉండేవి కాదు. దాంతో.. కొన్ని దేశాలు ఓవర్‌లో 4 బంతుల రూల్‌ని ఫాలో అయ్యేవి. ఇంకొన్ని దేశాల్లో 8 బంతుల రూల్ కూడా ఉండేది. ఈ తేడాల వల్ల విపరీతమైన గందరగోళంగా ఉండేది. ఏంటి నమ్మట్లేదా..? ఒక్కసారి ఊహించండి.. మన గల్లీ క్రికెట్లో ఒక్క బాల్ వైడా? కాదా..? అనే దానిపైనే మనం కొట్టుకుసస్తాం. అట్లాంటిది. ఎప్పుడైనా.. 8 బాల్స్ ఓవర్ ఫాలో అయ్యే టీమ్‌తో 4 బాల్స్ ఓవర్ ఆడే టీమ్ మ్యాచ్ ఆడాల్సి వస్తే ఏ రేంజ్‌లో రచ్చ జరుగుతుందో!





















