(Source: ECI/ABP News/ABP Majha)
Coivshield Third Dose : కోవిషీల్డ్ మూడో డోస్‌కు నో.. "సీరం"కు పర్మిషన్ ఇవ్వని కేంద్రం !
కోవిషీల్డ్ మూడో డోస్‌ను పంపిణీ చేయడానికి సీరం పెట్టుకున్న దరఖాస్తును కేంద్రం తిరస్కరించింది.
సీరం ఇనిస్టిట్యూట్ మూడో డోస్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు చేసుకున్న ధరఖాస్తును కేంద్రం తిరస్కరించింది. ఒమిక్రాన్ టెన్షన్ పెరుగుతున్న సమయంలో తమకు మూడో డోస్‌కు అనుమతి లభిస్తుందని కోవిషీల్డ్ తయారీ దారు అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆశించింది. కానీ వారి అభ్యర్థనపై సమీక్ష జరిపిన కేద్రం తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడో డోస్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని సీరం సంస్థను ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్ ప్యానల్ వివరణ కోరింది.
Also Read : వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!
ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా బూస్టర్ డోస్‌ల కోసం డిమాండ్ పెరుగుతున్నందున మూడో డోస్ ఇస్తామని సీరం సంస్థ బదులిచ్చింది. దీంతో ఎక్స్‌పర్ట్ కమిటీ సంతృప్తి చెందలేదు. అదే సమయంలో కోవిషీల్డ్ , కోవాక్సిన్ టీకాలు వేయించుకున్న వారికి కార్బెవాక్స్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు క్లినికల్ ట్రయల్స్ కోసం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్ ఇ చేసిన అభ్యర్థనను కూడా తోసి పుచ్చింది. టీకాలు వేసిన వ్యక్తులలో కూడా యాంటీబాడీస్ తగ్గుముఖం పట్టవచ్చని అనేక దేశాలు ఇప్పటికే బూస్టర్ డోస్‌లు ఇస్తున్నాయని అందుకే తాము బూస్టర్ డోస్ తయారు చేస్తమని బయలాజికల్ ఈ దరఖాస్తు పత్రంలో పేర్కొంది. కానీ సబ్జక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ అంగీకారం తెలియచేయలేదు.
నిజానికి ఒమిక్రాన్ బయటపడక ముందు నుంచే్ంటే గత జూన్‌లోనే కోవిషీల్డ్ మూడోడోస్ మంచిదని సీరం సంస్థ ప్రకటించింది. రెండో డోసు వేసుకున్న ఆరు నెలల తర్వాత మూడో డోసు వేసుకుంటే యాంటీబాడీస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని గత జూన్‌లోనే ప్రకటించింది. కరోనా వేరియంట్లు వరుసగా బయట పడుతూండటంతో అందరికీ మూడో డోస్ అవసరమవుతుందని అంచనా వేసింది. అయితే కేంద్రం మాత్రం అంగీకరించలేదు.
Also Read: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...
ప్రస్తుతం ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 150కిపైగా దేశాల్లో వినియోగిస్తున్నారు. కోవాగ్జిన్ పరిమితమైన ఉత్పత్తి కారణంగా ఇండియాలోనూ అత్యధిక మందికి కోవిషీల్డ్‌నే పంపిణీ చేశారు. ఇండియా నుండి ఇతర దేశాలకు ఎగుమితి చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరిగితే .. బూస్టర్ డోస్ అవసరమని నిపుణులు చెబితే ఆ తర్వాత అంగీకరించే అవకాశం ఉంది.
Also Read: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి