By: ABP Desam | Updated at : 09 Dec 2021 12:36 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఇప్పటికే అభివృద్ధి చేసిన టీకాలు కరోనా వేరియంట్లపై, ముఖ్యంగా ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉంది. కానీ దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ అధ్యయనం మాత్రం కాస్త కలవరపెట్టే అంశాన్ని బయటపెట్టింది. వారు చేసిన పరిశోధనలో ఫైజర్ వ్యాక్సిన్ ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేయడం లేదని తేలింది. దాదాపు 40 శాతం తక్కువ ప్రభావంతో పనిచేస్తుందని తమ పరిశోధనలో తేలినట్టు చెప్పారు. దీంతో ఫైజర్ టీకా తీసుకున్నవాళ్లంతా కలవరపడుతున్నారు. వీరీ అధ్యయనంలో అసలు వైరస్ తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించడానికి ఫైజర్ టీకా వల్ల శరీరంలో ఉత్పత్తి చేయబడిన యాంటీ బాడీస్‌లో 41 రెట్లు క్షీణత కనిపించింది.
ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ అలెక్స్ సిగల్‌తో సహా 12 మంది శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలో పాల్గొంది. ఈ అధ్యయనంలో 14 మంది ప్లాస్మా నమూనాలను పరీక్షించింది. వారందరూ ఫైజర్ టీకాలు తీసుకున్నవారే. వారి రక్తంలో యాంటీ బాడీల్లో చాలా తగ్గుదల కనిపించింది. అంతేకాదు గతంలో వచ్చిన బీటా వేరియంట్ ను అడ్డుకునే సామర్థ్యంలో కూడా మూడు రెట్లు యాంటీబాడీలు పడిపోయాయి. ఇక ఒమిక్రాన్‌ను మాత్రం ఫైజర్ టీకా ఏం తట్టుకుంటుంది? అని అభిప్రాయపడుతున్నారు పరిశోధకులు. ఫైజర్ టీకా తీసుకున్న వారికి బూస్టర్ డోస్ అవసరమా కాదా అన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
సూపర్ మ్యుటెంట్ ఒమిక్రాన్ ఇతర వేరియంట్ల కన్నా ఎక్కువగా వ్యాపిస్తుందా? వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన రోగనిరోధక శక్తిని తట్టుకుని నిల్చుంటుందా? ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉంటుందా అనే విషయాలు నిర్ధారించడానికి ల్యాబ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఫలితాలు వచ్చాక ఈ అంశంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...
Read Also: కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు
Read Also: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?
AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !
Weight Gain: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి
బ్రెయిన్ స్ట్రోక్ భయం వెంటాడుతోందా? మీ మొబైల్‌తో ఆ ముప్పును ముందే కనిపెట్టేయొచ్చు!
HeadPhones: హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే మెదడు, గుండెకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!