IPL 2025 Playoffs: హైదరాబాద్, చెన్నై, ముంబై జట్లు ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనా? పాయింట్ల పట్టికలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?
IPL 2025: 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ 18 సీజన్‌లో ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశం ఉన్న టీమ్స్ ఏవీ? 10 జట్ల ప్లేఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయి.

IPL 2025 ప్లేఆఫ్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. టోర్నమెంట్‌లో 22 మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్‌ను దృష్టిలో పెట్టుకొని జట్లు ఆడతాయి. దీంతో ప్లేఆఫ్స్ బెర్త్‌కు చేరడానికి జరిగే ఈ సమరం మరింత ఉత్కంఠగా మారనుంది. ఐదేసి సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ప్లేఆఫ్స్ చేరేందుకు చెమట చిందించాల్సిందే. ప్రారంభ మ్యాచ్‌ల్లో వరుస ఓటములు ఆ జట్లను భారీగానే దెబ్బతీస్తున్నాయి. ప్లేఆప్‌కు వెళ్లే మార్గాలను మరింత క్లిష్టంగా మార్చేస్తున్నాయి.
IPL 2025లో 22 మ్యాచ్‌లు ఇప్పటివరకు జరిగాయి. ముంబై ఇండియన్స్ ఆడిన 5 మ్యాచ్‌లలో నాలుగింటిలో ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుది అదే పరిస్థితి. ఇప్పుడు టాప్ 4లో ఉన్న 3 జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేకపోయిన జట్లే ఉన్నాయి. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్, మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాల్గో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. టోర్నమెంట్‌లో ఆడుతున్న ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆ తరువాత టాప్ 4లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన జట్లు వచ్చే సీజన్ తమ లక్‌ను పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)
అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ IPL 2025లో ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సీజన్ 18లో అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టుగా ఉంది. 3 మ్యాచ్‌లు ఆడి గెలిచిన డీసీ 6 పాయింట్లతో+1.257 రన్‌రేటు కలిగి ఉంది. ఇప్పుడు ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మరో 5 మ్యాచ్‌లు గెలిస్తే సరిపోతుంది.
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)
శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3 మ్యాచ్‌లు గెలిచింది. ఈ జట్టుకి కూడా 6 పాయింట్లు ఉన్నాయి. దాని నెట్ రన్ రేట్ +1.031గా ఉంది. ఈ జట్టు ప్లేఆఫ్స్‌లో చోటు కోసం ఆడబోయే 10 మ్యాచ్‌లలో కనీసం 5 మ్యాచ్‌లు గెలవాలి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని RCB ఈ సీజన్‌లో దుమ్మురేపుతోంది. చాలా గట్టిపోటీ ఇస్తోంది. జట్టు బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈజట్టు కూడా మూడింటిలో విజయం సాధించి +1.015 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. ఇంకా ఈ జట్టు పది మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో ఐదు గెలిస్తే ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.
పంజాబ్ కింగ్స్ (Punjab Kings)
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ కూడా 4 మ్యాచ్‌లలో మూడింటిని గెలిచింది. ఈ జట్టు బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు పంజాబ్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ తదుపరి 10 మ్యాచ్‌లలో కనీసం 5 మ్యాచ్‌లు గెలవాలి.
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)
రిషభ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడింటిని గెలుచుకుంది. జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. అది ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాలి. అందులో 5 మ్యాచ్‌లు గెలవాలి.
కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)
అజింక్యా రహానే కెప్టెన్సీలోని KKR మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయి టోర్నమెంట్‌ను ప్రారంభించింది. తర్వాత కాస్త కోలుకుంది. ఐదు మ్యాచ్‌లకు రెండు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇంకా ఈ జట్టు 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 6 మ్యాచ్‌లు గెలవాలి, లేకపోతే ప్లే ఆఫ్‌కు వెళ్లడం చాలా కష్టం అవుతుంది.
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)
సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ మొదట ఆడిన 2 మ్యాచ్‌లు ఓడింది. కానీ ఆ తరువాత జరిగిన 2 మ్యాచ్‌లు గెలుచుకుంది. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరడానికి తదుపరి 10 మ్యాచ్‌లలో కనీసం 6 మ్యాచ్‌లు గెలవాలి.
ముంబై ఇండియన్స్ (Mumbai Indians)
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గత సంవత్సరం కూడా బాగా ఆడలేదు. ఈ సీజన్ లో కూడా జట్టు అంతగా ఆకట్టుకునే ఆటతీరు కనబర్చడం లేదు. ముంబై 5 మ్యాచ్‌లు ఆడింది. కానీ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ముంబై ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాలి. ఇందులో కనీసం 7 మ్యాచ్‌లు గెలిస్తే తప్ప ప్లేఆఫ్స్ రేసులో నిలబడే ఛాన్స్ లేదు. మరో రెండు మ్యాచ్‌లు ఓడిందంటే చాలా ప్లేఆఫ్స్ పోటీ నుంచి తప్పుకున్నట్టే.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ 5 లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. అది కూడా 9 మ్యాచ్‌లు ఆడాలి. కానీ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే కనీసం 7 మ్యాచ్ లు గెలవాలి.
సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)
పాట్ కమిన్స్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా చెన్నై, ముంబై కంటే దారుణంగా ఉంది. ఆ జట్టు కూడా 5 లో 4 మ్యాచ్‌లు ఓడింది. నెట్ రన్ రేట్ ఆధారంగా జట్టు చివరి స్థానంలో ఉంది. హైదరాబాద్ కూడా తదుపరి 9 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లు గెలవాలి. లేకపోతే జట్టు ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం దాదాపుగా లేనట్టే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

