అన్వేషించండి

Swami Ramdev On 31st Sanyas Diwas: అందరూ శ్రీరామచంద్రుడి లాంటి వ్యక్తిత్వాన్ని కలిగిఉండాలన్న బాబా రామ్‌దేవ్ 

Baba Ramdev: శ్రీ రాముడి సద్గుణాలను, వ్యక్తిత్వాన్ని అంతా అనుసరించాలని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్ . స్వామి రామ్‌దేవ్ 31వ సన్యాస దివస్ సందర్భంగా  హరిద్వార్‌లోని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు

Swami Ramdev On 31st Sanyas Diwas Baba Ramdev: స్వామి రామ్‌దేవ్ 31వ సన్యాస దివస్‌ను హరిద్వార్‌లోని పతంజలి వెల్‌నెస్‌లో యోగా భవన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నవరాత్రి యజ్ఞం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ స్వామి రామ్‌దేవ్‌కు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రసగించించిన యోగా గురువు బాబా రాందేవ్ భారతదేశం సనాతన సంస్కృతి, ఋషి-వేద సంప్రదాయం, రాముడు-కృష్ణుడు, ఆదిశక్తి గురించి మాట్లాడారు. మనిషిలో పేరుకుపోయిన చీకటి, అజ్ఞానం, ప్రతికూలత అనే రాక్షసులను జయించి రాముడి లాంటి స్వభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు బాబా రాందేవ్. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. దుష్టశిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మనిషి రూపంలో భూమిపై అవతరించి ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది.  చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నంలో జన్మించాడు దశరథ తనయుడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను  సొంతబిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రాముడిని షోడస గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి  నిలువెత్తు నిర్వచనంగా రాముడిని చూపిస్తారు. మనిషి అంటే ఇలా బ్రతకాలి అని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. ఈ జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు శ్రీరాముడు. అయనము అంటే నడక అని అర్థం.. రామాయణం అంటే రాముని నడక అని అర్థం. ఆ నడకను అనుసరించాలి, ఆ గుణాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు బాబా రాందేవ్.
 
తాను సన్యాసిగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సన్యాసి జీవితంలోకి అడుగుపెడుతున్నానని చెప్పారు. సన్యాసికి ఒకే ఒక విధి ఉందని - యోగధర్మం ద్వారా రాష్ట్రధర్మం, సేవాధర్మం, యుగధర్మాన్ని నిర్వర్తించడం, ఈ దేశానికి ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు , సంస్కృతిని అందించడం అని ఆయన అన్నారు. చైత్ర నవరాత్రుల సందర్భంగా నవమి రోజు ప్రత్యేకంగా బాల పూజ చేశారు. ఈ పూజలో పాల్గొన్న బాబా రాందేవ్  బాలికల పాదాలు కడిగి, వారికి తినిపించి, ఆశీర్వాదాలు పొందారు. సాధారణంగా ఆశ్వయుజమాసంలో వచ్చే దసరా నవరాత్రుల్లో బాలపూజ/కౌమారీ పూజ చేస్తారు. అలాగే చైత్ర మాసంలో వచ్చే మొదటి తొమ్మిది రోజులను చైత్ర నవరాత్రులు పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు రోజుకే అలంకారంలో అమ్మవారిని అలంకరించి నవదుర్గలను ఆరాధిస్తారు. ఇందులో భాగంగా బాలపూజ చేశారు బాబా రాందేవ్.  
 
బాబా రామ్‌దేవ్ సన్యాసం తీసుకోవడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువలకు కీర్తిని అందించారని..భారతదేశ వైభవ సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేశారని ఆచార్య బాలకృష్ణ అన్నారు. సనాతన ధర్మంలో నవరాత్రికి ప్రత్యేక స్థానం ఉంది. తల్లి భగవతి అందరినీ ఆశీర్వదించాలి, ప్రతి ఒక్కరి జీవితంలో శుభం, ఆరోగ్యం, శ్రేయస్సు,  ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన ప్రార్థించారు. బాల పూజతో మనిషిలో దుర్గుణాలు, దుష్టశక్తులు, చెడు అలవాట్లు, రాక్షస స్వభావాన్ని జయించాలని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర నవరాత్రి భారతదేశ గొప్ప సంస్కృతి , సంప్రదాయంలో ఒక భాగం. దానిని అనుసరించడం మన కర్తవ్యం అని పిలుపునిచ్చారు ఆచార్య బాలకృష్ణ.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget