Summer Tour Guide : సమ్మర్లో టూర్‌కి సిమ్లా, మనాలితో పాటు ఈ ప్లేస్‌లు అవాయిడ్ చేస్తే మంచిది.. ఎందుకంటే
Summer Tour : వేసవికాలంలో మీరు టూర్‌కి వెళ్లాలని ప్లాన్ వేసుకుంటే ఈ ఫేమస్ ప్రదేశాలను అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తున్నారు. ఆ ప్రాంతాలు ఏంటో.. దానివెనకున్న రీజన్స్ ఏంటో చూసేద్దాం.

Avoid These Destinations in Summer : ఇండియాలో సమ్మర్ టూర్‌కి వెళ్లేందుకు సిమ్లా, మనాలి వంటి ప్రదేశాల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే వేసవితాపం నుంచి రిలాక్స్ అయ్యేందుకు వీటిని బెస్ట్‌గా భావిస్తారు. కానీ ఈ ఫేమస్ ప్లేస్‌లకు సమ్మర్లో వెళ్లకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. సిమ్లా, మనాలితో పాటు సమ్మర్‌కి వెళ్లగలిగే ప్లేస్‌లు ఏంటి.. వాటిని ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
సిమ్లా
సమ్మర్లో సిమ్లాకి టూర్‌కి వెళ్లడమనేది బెస్ట్ ఆప్షన్. ఇండియాలోని అత్యంత ప్రసిద్ధమైన హిల్ స్టేషన్లలో ఇది ఒకటి. కాబట్టి సమ్మర్లో ఇక్కడికి వెళ్లేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హోటల్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. విజిటింగ్ ప్లేస్‌లలో వెయిటింగ్ ఎక్కువగా ఉంటుంది.
మనాలి
వేసవిలో మనాలికి చాలా మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండొచ్చు. రోహ్తాంగ్ పాస్, సోలాంగ్ వ్యాలీలు ఫుల్ రష్‌గా ఉంటాయి. ట్రిప్‌ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకునేవారు ఇక్కడికి వెళ్లకపోవడమే మంచిది.
గోవా
బీచ్‌లను ఎంజాయ్ చేయాలనుకునేవారు సమ్మర్లో గోవాకు చెక్కేస్తారు. మీరు కూడా సమ్మర్లో అక్కడి వెళ్లాలనుకుంటే వాయిదా వేసుకోవడమే బెటర్. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు సమ్మర్లో గోవాకు వెళ్లకపోవడమే మంచిది. ఆఫ్ సీజన్ వల్ల చాలా బీచ్‌లు కూడా మూసేస్తారు.
ఊటీ
ఊటీ బ్యూటీకి ఫిదా అవ్వనివారు ఉండరు. ఈ ప్లేస్‌కి సమ్మర్లో వెళ్లేవారు ఎక్కువే. అక్కడి తేయాకు తోటలు, సరస్సులు ఊటీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే సమ్మర్లో ప్లాన్‌లో ఊటీ ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. డెస్టినేషన్ రీచ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
నైనిటాల్
వేసవిని కూల్ కూల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటే నైనిటాల్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. నైని సరస్సు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. కానీ సమ్మర్లో ఇక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పార్కింగ్ కష్టంగా ఉంటుంది. హోటల్స్ కూడా దొరకడం కష్టమే. దీనివల్ల మీరు ఎంజాయ్ చేయడం కంటే స్ట్రగుల్ ఎక్కువగా అవుతారు.
మున్నార్
చల్లని విహార యాత్రకు వెళ్లాలనుకుంటే మున్నార్ బెస్ట్ ప్లేస్. కానీ సమ్మర్లో ఇక్కడి తేయాకు తోటలను ఆస్వాదించేందుకు చాలామంది వెళ్తుంటారు. హోటళ్లు, హోమ్ స్టేలు దొరకడం కాస్త కష్టంగా ఉంటుంది.
ప్రశాంతంగా సమ్మర్ ట్రిప్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే వీటిని కాకుండా.. మీకు బాగా తెలిసినా.. దగ్గర్లోని ప్లేస్‌లను ఎక్స్ప్లోర్ చేసేందుకు ట్రై చేయండి. లేదంటే.. ముందుగానే హోటల్స్, ట్రావెల్ బుకింగ్స్ చేసుకుని ప్రీ-ప్లాన్డ్గా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్లాలనుకుంటే ఈ ప్రాంతాలకు వెళ్లకపోవడమే బెస్ట్.






















